Australia: ప్రపంచకప్‌ జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. 15 మంది ఆటగాళ్ల పేర్లు ఖరారు..

Australia: 2022లో జరగనున్న పురుషుల ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఈ ICC టోర్నమెంట్ వెస్టిండీస్‌లో ఆడాల్సి ఉంది.

Australia: ప్రపంచకప్‌ జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. 15 మంది ఆటగాళ్ల పేర్లు ఖరారు..
Australia
Follow us

|

Updated on: Dec 14, 2021 | 8:58 AM

Australia: 2022లో జరగనున్న పురుషుల ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఈ ICC టోర్నమెంట్ వెస్టిండీస్‌లో ఆడాల్సి ఉంది. దీని కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసింది. కూపర్ కాన్లీ కూడా ఈ జట్టులో స్థానం పొందాడు. అతడు రెండో అండర్ 19 ప్రపంచ కప్ ఆడుతున్నాడు. అంతకుముందు దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్ 19 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కూపర్‌తో పాటు 17 ఏళ్ల హర్కీరత్ బజ్వా కూడా జట్టులో స్థానం సంపాదించాడు. ఐసిసి అండర్ 19 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా గ్రూప్ డిలో చోటు దక్కించుకుంది. ఇది కాకుండా ఆతిథ్య వెస్టిండీస్, స్కాట్లాండ్, శ్రీలంక ఈ గ్రూప్‌లో ఉన్నాయి. 15 మందితో కూడిన ఆస్ట్రేలియా జట్టుకు ఆంథోనీ క్లార్క్ కోచ్‌గా వ్యవహరిస్తారు.

జట్టులోని ఆటగాళ్లు – కోచ్ ఆస్ట్రేలియా జట్టు కోచ్ ఆంథోనీ క్లార్క్ మాట్లాడుతూ.. “మా జట్టులో అన్ని రకాల ఆటగాళ్లు ఉన్నారు. దేశవాళీ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో చాలామంది గతంలో తమ ప్రదర్శనను నిరూపించుకున్నారు. అనేక మ్యాచ్‌లోలో రాణించారు. అండర్-19 ప్రపంచకప్‌లో ఆడడం ద్వారా ఈ ఆటగాళ్ల ప్రదర్శన మరింత మెరుగవుతుందని అనుకుంటున్నాను. వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్‌లో గొప్ప స్థానాలకు వెళుతారు. కాబట్టి ఎవరు ఏ విధంగా ఆడతారనేది ఆసక్తిగా మారింది” అన్నారు.

ICC U19 ప్రపంచ కప్ కోసం ఎంపికైన 15 మంది సభ్యులు హర్కీరత్ బజ్వా, ఐడెన్ కాహిల్, కూపర్ కాన్లీ, జాషువా గార్నర్, ఇషాక్ హిగ్గిన్స్, క్యాంప్‌బెల్ కెలావే, కోరీ మిల్లర్, జాక్ నిస్బెట్, నివేతన్ రాధాకృష్ణన్, విలియం సాల్జ్‌మాన్, లాక్లాన్ షా, జాక్సన్ సీన్‌ఫెల్డ్, టోబియాస్ స్నెల్, టామ్ విట్నీ, రిజర్వ్ ప్లేయర్స్: లియామ్ బ్లాక్‌ఫోర్డ్, లియామ్ డోడ్రెల్, జోయెల్ డేవిస్, సామ్ రహ్లే, అనుబ్రే స్టాక్‌డేల్

ఈ సంవత్సరం పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించిన ప్రదేశాలు ఇవే..! ఎందుకో తెలుసా..?

ఏకకాలంలో మూడు జట్లకు కోచింగ్‌ చేస్తున్న శ్రీలంక లెజండరీ బ్యాట్స్‌మెన్‌.. ఇది ఎలా జరిగిందంటే..?

మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌.. 8 సిక్సర్లు 13 ఫోర్లతో బౌలర్లకు చుక్కలు..