AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌.. 8 సిక్సర్లు 13 ఫోర్లతో బౌలర్లకు చుక్కలు..

Martin Coetzee: డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాలో భారత పర్యటన ప్రారంభం కానుంది. అయితే అంతకు ముందు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్

మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌.. 8 సిక్సర్లు 13 ఫోర్లతో బౌలర్లకు చుక్కలు..
Martin
uppula Raju
|

Updated on: Dec 13, 2021 | 3:19 PM

Share

Martin Coetzee: డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాలో భారత పర్యటన ప్రారంభం కానుంది. అయితే అంతకు ముందు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ మెరుపు సెంచరీ చేశాడు. ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. అయితే ఈ బ్యాట్స్‌మన్‌కు దక్షిణాఫ్రికా సిరీస్‌కు సంబంధం లేదు. ఎందుకంటే ఈ 33 ఏళ్ల బ్యాట్స్‌మెన్‌కు దక్షిణాఫ్రికా జట్టులో చోటు దక్కలేదు. అలాగే ఈ బ్యాట్స్‌మెన్ ఇంతకు ముందు దక్షిణాఫ్రికా తరఫున ఆడలేదు. మార్టిన్ కోయెట్జ్ అనే ఈ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ హాంకాంగ్ ఆల్ స్టార్స్ 50 ఓవర్ల సిరీస్‌లో ఈ తుఫాను సెంచరీ చేశాడు.

హాంకాంగ్ ఆల్ స్టార్స్ 50 ఓవర్ల సిరీస్ మ్యాచ్ కౌలూన్ లయన్స్, హాంకాంగ్ దీవుల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కౌలూన్ లయన్స్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 299 పరుగులు చేసింది. కౌలూన్ లయన్స్ తరఫున వకాస్ ఖాన్ 122 పరుగులు చేయగా, ఐజాజ్ ఖాన్ 104 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ల సహకారంతో కౌలూన్ లయన్స్ హాంకాంగ్ ద్వీపవాసులకు 300 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ ఓటమిని చవి చూసింది.

21 బంతుల్లో ‘సెంచరీ’ హాంకాంగ్ దీవుల కోసం మార్టిన్ కోయెట్జ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. క్రీజులోకి దిగగానే విజృంభించాడు. ఓపెనింగ్ వికెట్‌కు తన భాగస్వామి ఆదిత్ గోర్వారాతో కలిసి 123 పరుగులు జోడించాడు. అదిత్ ఔటైనా మార్టిన్ తన దూకుడు ఆపలేదు. ఎంతలా అంటే కేవలం 21 బంతుల్లో 100 పరుగులు పిండేశాడు. మొత్తం మీద 120 బంతుల్లో 157 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. మార్టిన్ తన 157 పరుగుల ఇన్నింగ్స్‌లో ఫోర్లు, సిక్స్‌లు అంటే కేవలం బౌండరీల ద్వారా 100 పరుగులు చేసాడు. ఇందులో 13 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. మార్టిన్ కోయెట్జ్ తన పేలుడు ఇన్నింగ్స్‌తో పాటు కెప్టెన్ బాబర్ హయత్ కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. 67 బంతుల్లో 81 పరుగులు చేశాడు. వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు అద్భుతమైన సెంచరీ భాగస్వామ్యం నెలకొంది. ఈ భాగస్వామ్యం ఫలితంగా హాంకాంగ్ ద్వీపవాసులు కేవలం 44 ఓవర్లలో మ్యాచ్‌ను గెలుచుకున్నారు.

Banks closed: ఈ వారంలో బ్యాంకులు 2 రోజులు బంద్‌.. పనులు త్వరగా ముగించండి..