Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధోని నగరంలో చుక్కలు చూపించిన మరో వికెట్ కీపర్.. 8 సిక్సర్లు 11 ఫోర్లతో తుఫాన్‌ సెంచరీ..

Manender Singh: ఆడమ్ గిల్‌క్రిస్ట్ నుంచి ఎంఎస్ ధోనీ వరకు తుఫాను ఇన్నింగ్స్‌లు ఆడిన వికెట్‌ కీపర్‌ల లిస్టులో రిషబ్‌ పంత్‌ పేరు కూడా తోడైంది.

ధోని నగరంలో చుక్కలు చూపించిన మరో వికెట్ కీపర్.. 8 సిక్సర్లు 11 ఫోర్లతో తుఫాన్‌ సెంచరీ..
Manender Singh
Follow us
uppula Raju

|

Updated on: Dec 13, 2021 | 1:54 PM

Manender Singh: ఆడమ్ గిల్‌క్రిస్ట్ నుంచి ఎంఎస్ ధోనీ వరకు తుఫాను ఇన్నింగ్స్‌లు ఆడిన వికెట్‌ కీపర్‌ల లిస్టులో రిషబ్‌ పంత్‌ పేరు కూడా తోడైంది. అయితే ఇక్కడ వీరి గురించి మాట్లాడటం లేదు. తాజాగా మరో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధోని నగరంలో బౌలర్లకు చుక్కలు చూపించాడు. విజయ్ హజారే ట్రోఫీలో రాజస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మనేందర్ సింగ్ తుఫాను సెంచరీ సాధించాడు. ధోనీ స్వస్థలమైన రాంచీలో అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో166 పరుగుల భారీ ఇన్నింగ్స్‌కు నాటౌట్‌ స్క్రిప్ట్ రాశాడు.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. అభిజిత్‌ తోమర్‌, మనేందర్‌ సింగ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు అర్ధసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత మానేందర్ సింగ్, మహిపాల్ లోమ్రోర్ రెండో వికెట్‌కు డబుల్ సెంచరీ భాగస్వామ్యం అందించారు. 208 పరుగులు చేశారు. ఈ క్రమంలో మహిపాల్ లోమ్రోర్‌ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం ఈ జంటకు బ్రేక్ పడింది. వీరిద్దరు చెలరేగడంతో జట్టు స్కోరు 300 దాటింది.

19 బంతుల్లో 92 పరుగులు మానేందర్ సింగ్ 132 బంతుల్లో 166 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అంటే కేవలం 19 బంతుల్లోనే 92 పరుగులు పిండేశాడు. మహిపాల్ లోమ్రోర్ 110 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 101 పరుగులు చేశాడు. ఈ రెండు సెంచరీల ఇన్నింగ్స్‌ల కారణంగా రాజస్థాన్ జట్టు 50 ఓవర్లలో 3 వికెట్లకు 335 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. 24వ మ్యాచ్‌లో 24వ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మనేందర్ సింగ్ నాలుగో సెంచరీ సాధించాడు. అదే సమయంలో 101 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన మహిపాల్ లోమ్రోర్‌కు ఇది తొలి సెంచరీ కావడం విశేషం.

ప్రతిరోజు రూ.417 పొదుపు చేయండి.. కోటి రూపాయలు సంపాదించండి..

పాడి జంతువులలో ఈ లక్షణాలు కనిపిస్తే చాలా ప్రమాదం.. ఆ వ్యాధి కావొచ్చు జాగ్రత్త..

Yamaha FZS: యమహా ఎఫ్‌జెడ్ ఎస్‌ కేవలం 28 వేలు మాత్రమే..! డీల్‌ ఏంటో తెలుసా..?