Yamaha FZS: యమహా ఎఫ్‌జెడ్ ఎస్‌ కేవలం 28 వేలు మాత్రమే..! డీల్‌ ఏంటో తెలుసా..?

Yamaha FZS: ఇండియన్ టూ వీలర్ సెగ్మెంట్లో అనేక స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు, స్పోర్ట్స్‌ బైక్స్‌ ఉన్నాయి. ఇవి విభిన్న ఫీచర్లతో వస్తున్నాయి.

Yamaha FZS: యమహా ఎఫ్‌జెడ్ ఎస్‌ కేవలం 28 వేలు మాత్రమే..! డీల్‌ ఏంటో తెలుసా..?
Yamaha Fzs
Follow us

|

Updated on: Dec 13, 2021 | 12:22 PM

Yamaha FZS: ఇండియన్ టూ వీలర్ సెగ్మెంట్లో అనేక స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు, స్పోర్ట్స్‌ బైక్స్‌ ఉన్నాయి. ఇవి విభిన్న ఫీచర్లతో వస్తున్నాయి. మీరు స్పోర్ట్స్ లుక్, మంచి ఫీచర్లతో కూడిన మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే దీని కోసం దాదాపు రూ.1 లక్ష ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు మనం అటువంటి డీల్ గురించి తెలుసుకుందాం. మీరు కేవలం రూ.28,000కే Yamaha FZ Sని కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతం ఈ మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసేందుకు షోరూం వెళితే రూ.98,680 నుంచి రూ.1.16 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ డీల్ గురించి వివరంగా తెలుసుకునే ముందు బైక్ పరిస్థితిని గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యమహా ఎఫ్‌జెడ్ ఎస్ సెకండ్ హ్యాండ్ సెగ్మెంట్ బైక్ Bikes24లో అమ్మకానికి ఉంది. సమాచారం ప్రకారం ఇది 2013 మోడల్. ఈ బైక్ ఢిల్లీలోని DL-10 RTO వద్ద నమోదు చేశారు. దీంతో పాటు ఒరిజినల్ ఆర్సీ కూడా అందుబాటులో ఉంటుంది.

యమహా ఎఫ్‌జెడ్ ఎస్ ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇది 153 సిసి ఇంజన్‌ని కలిగి ఉంటుంది. ఇది నడుస్తున్నప్పుడు 7500 ఆర్‌పిఎమ్ వద్ద 13.8 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఇది 6000 ఆర్‌పిఎమ్ వద్ద 13.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీనికి ఒక సిలిండర్ 5 గేర్లు ఉంటాయి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 160 మి.మీ. దీని బరువు 135 కిలోలు. అలాగే కంపెనీ ఇందులో 12 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను అందించింది. దీనికి BS4 కంప్లైంట్ సిస్టమ్ ఇచ్చారు. ఇది 40-45 kmpl మైలేజీని ఇస్తుంది. బ్రేక్ సిస్టమ్ గురించి మాట్లాడితే ఇది ముందు భాగంలో 267 mm హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉంది. వెనుక టైర్‌లో డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. దీనికి అల్లాయ్ వీల్స్ ట్యూబ్‌లెస్ టైర్లు అమర్చారు.

గమనిక: ఈ సమాచారం Bikes24లో ఉన్నది మాత్రమే. దీంతో టీవీ9కి ఎటువంటి సంబంధం లేదు. ఏదైనా సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసే ముందు దాని గురించి ఇచ్చిన సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి. వారంటీ, క్యాష్‌బ్యాక్ మొదలైన నిబంధనలను కూడా జాగ్రత్తగా పరిశీలించండి.

ఆస్ట్రేలియాలో విధ్వంసం సృష్టించిన కరేబియన్‌ ఆల్‌రౌండర్.. కేవలం 21 బంతుల్లో మ్యాచ్‌ రూపురేఖలు మార్చేశాడు..

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ ఎలా పొందాలో తెలుసా..! ఈ పద్దతులు పాటించండి..

ఈ 5 రాశుల వారు విడిపోయిన వారి మాజీలతో మళ్లీ కలుస్తారు..! ఎందుకంటే..?

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..