ఈ 5 రాశుల వారు విడిపోయిన వారి మాజీలతో మళ్లీ కలుస్తారు..! ఎందుకంటే..?

Zodiac Signs: మాజీలతో మళ్లీ కలవడం ఎప్పుడూ మంచిదికాదు. కానీ తనకోసం ఆలోచించే మనుషులను ఎప్పుడు ఎవరూ దూరం చేసుకోరు.

ఈ 5 రాశుల వారు విడిపోయిన వారి మాజీలతో మళ్లీ కలుస్తారు..! ఎందుకంటే..?
Zodiac Signs
Follow us
uppula Raju

|

Updated on: Dec 13, 2021 | 9:48 AM

Zodiac Signs: మాజీలతో మళ్లీ కలవడం ఎప్పుడూ మంచిదికాదు. కానీ తనకోసం ఆలోచించే మనుషులను ఎప్పుడు ఎవరూ దూరం చేసుకోరు. వైవాహిక బంధంలో గొడవల కారణంగా చాలామంది భార్యాభర్తలు విడిపోతారు. అయితే కొన్ని రోజుల తర్వాత వీరు మళ్లీ ఒకటవుతారు. ఎందుకంటే మనిషి దగ్గరగా ఉన్నప్పుడు వారి విలువ తెలియదు వారు దూరమైనప్పుడే వారేంటో ఎవ్వరికైనా తెలుస్తుంది. అలా విడిపోయిన వారు తిరిగి మళ్లీ వారి మాజీలను కోరుకునే ఐదు రాశుల గురించి తెలుసుకుందాం.

1. తులారాశి తుల రాశి వారు చాలా దయగలవారు. కష్టమైన నిర్ణయాలను త్వరగా తీసుకోలేరు. విడిపోయిన వ్యక్తి మంచిగా మారరాని, తనకోసం తపిస్తున్నాడని తెలిస్తే తిరిగి వారి జీవితంలోకి ఆహ్వానిస్తారు. వారిపై వందశాతం విశ్వాసం వ్యక్తం చేస్తారు.

2. కర్కాటక కర్కాటక రాశి వారు వారికిష్టమైన వ్యక్తులను హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. కాబట్టి అతను ఎవరితోనైనా విడిపోయినప్పుడు కానీ లేదా అదృశ్యమైనా కానీ భరించలేరు. తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తారు. అందుకే వీరు వారు మాజీలతో రాజీ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి ప్రేమ తప్ప మరేమీ అక్కర్లేదు.

3. మీనం మీనం రాశి వ్యక్తులు తమ జీవితం పట్ల చాలా సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. అందువల్ల అతను తన మాజీ గురించి గొప్పగా భావిస్తారు. అవకాశం ఇస్తే తన మాజీ వద్దకు తిరిగి వస్తారు. తద్వారా వారికి ఓదార్పు అందిస్తారు. చేసిన తప్పులను తెలుసుకుంటారు.

4. కన్య కన్య రాశి వారు చాలా మొండిగా ఉంటారు కాబట్టి వారి తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు. తద్వారా వారు కోల్పోయిన విలువైన క్షణాలను తిరిగి పొందాలని భావిస్తారు. అందుకే వీరు తిరిగి మాజీలను చేరుకుంటారు. కన్య రాశి వారు చాలా అనురాగాన్ని కోరుకుంటారు.

5. వృషభం వృషభ రాశి వారు ఒకరి జీవితంలోకి వచ్చాక వారికోసం ఏదైనా చేస్తారు. అనుక్షణం వారికోసం తపిస్తారు. అలాంటి సంబంధం దూరమైనప్పుడు వారు భరించలేరు. అందుకే తిరిగి వారి మాజీల వద్దకు వస్తారు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించండి. ఇది సాధారణ పాఠకుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగింది.

LIC Policy: ఎల్‌ఐసీ పాలసీ సరెండర్‌ చేస్తున్నారా.. కచ్చితంగా ఈ నియమాలు తెలుసుకోండి..

Infinix: ఇండియాలో ఈరోజు 2 స్మార్ట్‌ఫోన్లు విడుదల.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

Indian Army 2021: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఇండియన్‌ ఆర్మీ నుంచి నోటిఫికేషన్.. అర్హతలు, ఖాళీలు ఇవే..