Infinix: ఇండియాలో ఈరోజు 2 స్మార్ట్‌ఫోన్లు విడుదల.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
Infinix: Infinix ఈరోజు భారతదేశంలో రెండు సరసమైన స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతోంది. వాటి పేర్లు Infinix Note 11, Note 11S.
Infinix: Infinix ఈరోజు భారతదేశంలో రెండు సరసమైన స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతోంది. వాటి పేర్లు Infinix Note 11, Note 11S. ఈ రెండు మొబైల్ ఫోన్లు లాంచ్ చేయడానికి ముందు వాటి గురించి చాలా స్పెసిఫికేషన్‌లు వెల్లడయ్యాయి. ప్రధాన స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుతూ.. ఈ రెండు ఫోన్‌లు మూడు కలర్ వేరియంట్‌లలో వస్తున్నాయి. ఈ ఫోన్లు 5000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ కలిగి ఉన్నాయి. ఈ మొబైల్స్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.
ఇన్ఫినిక్స్ నోట్ 11 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు Infinix Note 11 6.7-అంగుళాల డ్యూ డ్రాప్ నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది FHD + రిజల్యూషన్‌తో వస్తుంది. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 91 శాతం, నోట్ 11S 6.75-అంగుళాల పంచ్ హోల్ డిస్‌ప్లే ఉంటుంది. దీని రిఫ్రెష్ రేట్ 120hz, ఇది స్క్రోలింగ్, గేమింగ్ అనుభవాన్ని ఇస్తుంది. Infinix రెండు ఫోన్‌ల మందం 7.9 mm. ఈ ఫోన్ లేటెస్ట్ డిజైన్‌ను కలిగి ఉంది. దీని కెమెరా పరిమాణం కూడా పెద్దదిగా ఉంటుంది.
Infinix Note 11 సిరీస్ కెమెరా సెటప్ Infinix Note 11 సిరీస్ కెమెరా సెటప్ గురించి చెప్పాలంటే ఇది వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులోని ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్స్. అదనంగా 2 మెగాపిక్సెల్ బోకె లెన్స్, మూడో లెన్స్ AI లెన్స్‌ను కలిగి ఉంటుంది. 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా 11Sలో అందుబాటులో ఉంటుంది. ఇది 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. Infinix Note 11 సిరీస్‌లోని రెండు ఫోన్‌లలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. ఇందులో క్వాడ్ LED ఫ్లాష్ లైట్ ఉంటుంది. దీని సహాయంతో 1440p వీడియోను క్యాప్చర్ చేయవచ్చు.
ఇన్ఫినిక్స్ నోట్ 11 ప్రాసెసర్ Infinix Note 11 ప్రాసెసర్ గురించి చెప్పాలంటే.. MediaTek Helio G88 చిప్‌సెట్ ఇందులో ఇచ్చారు. ఇది 6 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుంది. అదే సమయంలో, Helio G96 చిప్‌సెట్ నోట్ 11Sలో ఇచ్చారు. ఇది 8GB RAM ,128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో ఎక్స్‌టెండ్ ర్యామ్ సౌకర్యం ఉన్నందున వినియోగదారులు అవసరమైతే 3 జీబీ వరకు ర్యామ్‌ని పెంచుకోవచ్చు. వినియోగదారులు అవసరమైతే మైక్రో SD కార్డ్‌ని జోడించవచ్చు. ఈ రెండు ఫోన్‌లు 5000mAh బ్యాటరీతో వస్తున్నాయి. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఇది డ్యూయల్ స్పీకర్లు, ఫేస్ అన్‌లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది.
Infinix Note 11, Note 11S ధర Infinix Note 11, Note 11S మూడు రంగులలో అందుబాటులోకి వస్తున్నాయి. థాయ్‌లాండ్‌లో, నోట్ 11S మూడు కలర్ వేరియంట్‌లలో విడుదల చేశారు. అదే సమయంలో నోట్ 11 కూడా మూడు వేరియంట్‌లలో ప్రవేశపెడుతున్నారు. Note 11S థాయిలాండ్‌లో సుమారు రూ.15000 ధర ఉంటే Note 11 కొంచెం తక్కువగా ఉందని తెలిసింది.