చలికాలంలో వేడి వేడి మొక్కజొన్న సూప్‌.. భలే పసందు.. ఇలా తయారు చేయండి..

Sweet Corn Soup: అత్యంత ప్రజాదరణ పొందిన సూప్‌లలో స్వీట్ కార్న్ సూప్ ఒకటి. మీరు చలికాలంలో ఈ సూప్‌ని భలే ఆస్వాదించవచ్చు.

చలికాలంలో వేడి వేడి మొక్కజొన్న సూప్‌.. భలే పసందు.. ఇలా తయారు చేయండి..
Sweet Corn Soup
Follow us

|

Updated on: Dec 13, 2021 | 8:29 AM

Sweet Corn Soup: అత్యంత ప్రజాదరణ పొందిన సూప్‌లలో స్వీట్ కార్న్ సూప్ ఒకటి. మీరు చలికాలంలో ఈ సూప్‌ని భలే ఆస్వాదించవచ్చు. రెస్టారెంట్లలో మాదిరిగానే ఈ సూప్‌ని ఇంట్లో కూడా తయార చేసుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. మొక్కజొన్న సూప్ చేయడానికి కొన్ని పదార్థాలు అవసరం. అంతేకాకుండా మీరు సూప్ చిక్కగా చేయడానికి కార్న్‌ఫ్లోర్‌ను కూడా ఉపయోగించవచ్చు. మీరు డిన్నర్ కోసం ఈ సూప్ చేయవచ్చు. స్వీట్ కార్న్ సూప్ కిట్టీ పార్టీ సమయంలో లేదా కుటుంబ విందు సమయంలో కూడా వడ్డించవచ్చు. మీరు ఇంట్లో కొత్త వంటకాలను ప్రయత్నించాలనుకుంటే స్వీట్ కార్న్ సూప్ రెసిపీని ప్రయత్నించవచ్చు.

స్వీట్ కార్న్ సూప్‌కి కావలసినవి 1. మొక్కజొన్న – 1/2 కప్పు 2. తురిమిన వెల్లుల్లి – 1 tsp 3. తురిమిన క్యారెట్ – 1/4 కప్పు 4. వెనిగర్ – 1 tsp 5. వెన్న – 2 tbsp 6. తురిమిన అల్లం – 1 tsp 7. తరిగిన పచ్చి ఉల్లిపాయ – 5 tbsp 8. మొక్కజొన్న పిండి – 1 tsp 9. నల్ల మిరియాలు – 1/4 tsp 10. ఉప్పు అవసరానికి తగిన విధంగా

ఎలా తయారు చేయాలి..?

1. కూరగాయలను వేయించాలి బాణలిలో వెన్న వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. చివరగా 1/4 కప్పు మొక్కజొన్న, క్యారెట్ కలపాలి. కొద్దిగా ఉప్పు వేసి కూరగాయలను 3-4 నిమిషాలు వేయించాలి.

2. పేస్ట్ చేయండి 1/4 కప్పు మొక్కజొన్న, 2 టేబుల్ స్పూన్ల నీటిని గ్రైండర్లో పేస్ట్‌గా చేయండి. ఈ పేస్ట్‌ను పాన్‌లో వేసి 3-4 నిమిషాలు వేయించాలి.

3. సూప్ ఉడికించాలి ఇప్పుడు 3 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టాలి. 10-12 నిమిషాలు వాటర్ ఒక కప్పుకు తగ్గించబడే వరకు మరిగించాలి. ఇప్పుడు 1 టేబుల్‌స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ను 2 టేబుల్‌స్పూన్‌ల నీటితో కలిపి మిశ్రమం తయారుచేయాలి. ఈ ద్రావణాన్ని సూప్‌లో వేసి బాగా కలపాలి. సూప్ చిక్కబడే వరకు 5-6 నిమిషాలు ఉడికించాలి.

4. సుగంధ ద్రవ్యాలు చల్లాలి చివరగా వెనిగర్, ఎండుమిర్చి పొడి, మిగిలిన పచ్చిమిర్చి వేసి రుచికి తగినట్లుగా ఉప్పు వేయాలి.

5. సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఒక గిన్నెలో సూప్ పోసి వేడి వేడిగా వడ్డించండి.

Indian Army 2021: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఇండియన్‌ ఆర్మీ నుంచి నోటిఫికేషన్.. అర్హతలు, ఖాళీలు ఇవే..

బ్యాంకు ఖాతాదారులకు పెద్ద భరోసా.. కచ్చితంగా 5 లక్షల గ్యారెంటీ..?

Banks closed: ఈ వారంలో బ్యాంకులు 2 రోజులు బంద్‌.. పనులు త్వరగా ముగించండి..