Palak Rice: తిన్నవే తిని బోర్ కొడుతుందా.. కాస్తా వెరైటీగా ఇలా ట్రై చేయండి..

ప్రతి రోజు ఓకే రకం భోజనం కాకుండా కొంత మార్పు అవసరం అని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఫైట్ రైస్‌తోపాటు కొంత పులిహోరా, పులావ్, కరివేపాకు రైస్‌ను..

Palak Rice: తిన్నవే తిని బోర్ కొడుతుందా.. కాస్తా వెరైటీగా ఇలా ట్రై చేయండి..
Palak Rice
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 13, 2021 | 6:44 PM

ప్రతి రోజు ఓకే రకం భోజనం కాకుండా కొంత మార్పు అవసరం అని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఫైట్ రైస్‌తోపాటు కొంత పులిహోరా, పులావ్, కరివేపాకు రైస్‌ను వండి వడ్డించవచ్చు. కొన్నిసార్లు ఎలాంటి వంటను చేయాలనేదానిపై తికమకపడతాం. వైట్ రైస్‌తోపాటు పాలకూర రైస్ చేసుకుంటే కుటుంబ సభ్యులు చాలా ఇష్టంగా తింటారు. చలికాలంలో పాలకూర చాలా ఆరోగ్యకరమైనది. మీరు పాల కూర రైస్ రెసిపీని ఎన్నడూ ప్రయత్నించకపోతే ఈ రోజు మనం ఈ రుచికరమైన.. ఆరోగ్యకరమైన వంటకం గురించి  తెలుసుకుందాం. ఇది తయారు చేయడం చాలా సులభం. ఇందులో ఉండే పాలకూర మీ కుటుంబానికి ఐరన్ అందిస్తుంది.

పాలకూర అన్నం ఎంత రుచికరంగా ఉంటుందో అంతే పోషకలను కలిగి ఉంటుంది. మనం నిత్యం ఇంట్లో ఉపయోగించే బియ్యంతో ఇది చేసుకోవచ్చు. మరింత రుచి కావాలంటే బాస్మతి బియ్యంతో ట్రై చేయవచ్చు. తాజా పాలకూరను ఇందులో ఉపయోగించాలి. దీన్ని రుచిగా చేయడానికి కొన్ని మసాలాలు కూడా ఉపయోగించాలి. పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈసారి ఫ్రైడ్ రైస్‌కు బదులుగా పాలక్ రైస్ రిసిపిని ప్రయత్నించండి.

పాలకూర విశిష్టత..

చలికాలంలో పాలకూర తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. పాలకూర అన్ని వయస్సులవారికి ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాదు, పాలకూరలో అనేక పోషకాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

  1.  బియ్యం ( బాస్మతి బియ్యం)
  2. తాజా పాలకూర
  3. చిన్న ముక్కలుగా తరిగిన బంగాళదుంపలు
  4. పచ్చి మిర్చి
  5. తరిగిన ఉల్లిపాయ ముక్కలు
  6. వెల్లుల్లి
  7. జీలకర్ర
  8. రుచికి మసాలా దినుసులు (గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, కారం, ఇంగువ, బే ఆకులు, ఉప్పు)

టేస్టీ పాలక్ రైస్ తయారు చేద్దాం 

  1. పాలక్ రైస్ తయారు చేయాలంటే ముందుగా తరిగిన పాలకూరను మిక్సీలో వేసి గ్రాండ్ చేయండి. కాస్త ఉప్పు వేసుకోవాలి.
  2. ఓ బానాలో నూనె కానీ నెయ్యి కాని వేసి అందులో తరిగిన ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలను, పోపు దినుసులను జోడించండి.
  3. తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు వండేటప్పుడు గ్యాస్ మీడియం మంట మీద ఉండాలని గుర్తుంచుకోండి.
  4. ఉల్లిపాయ ఉడికిన తర్వాత, దానికి సన్నగా తరిగిన బంగాళదుంపలను జోడించండి.
  5. బియ్యంను పోపులో వేసి ఉడికించాలి. పప్పుతో తినడానికి సింపుల్ రైస్ తయారుచేసే విధానం.
  6. ఆ తర్వాత రుచికి అనుగుణంగా ఉప్పు వేయండి, పాలకూర రైస్ రెడీ

ఇవి కూడా చదవండి: CM KCR: శ్రీరంగంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు.. మంగళవారం తమిళనాడు సీఎంతో ప్రత్యేక సమావేశం..

SMART Success: భారత అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం.. స్మార్ట్ ప్రయోగం విజయవంతం