CM KCR: శ్రీరంగంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు.. మంగళవారం తమిళనాడు సీఎంతో ప్రత్యేక సమావేశం..
శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్..
శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగనాథస్వామిని దర్శించుకుని.. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు సీఎం కేసీఆర్. వేద మంత్రాలతో రంగనాథ స్వామి ఆలయ పండితులు సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలోకి రావడంతోనే స్వామివారి వాహనం అయిన గజరాజు సీఎం కేసీఆర్‌కు ఆశీర్వాదం అందించింది. అంతకుముందు తిరుచ్చి కలెక్టర్ శివరాసు, తమిళనాడు మంత్రి అరుణ్ నెహ్రూ కేసీఆర్‌కు స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లారు.
తమిళనాడులో రెండు రోజులపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. మంగళవారం ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్‌తో సమావేశం కానున్నట్లు సమాచారం. మంగళవారం తిరుత్తణిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయ్యే అవకాశం ఉంది. స్టాలిన్ నివాసంలో మంగళవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ రాత్రికి తమిళనాడులోని ఐటీసీ హోటల్‌లో కేసీఆర్ బస చేయనున్నారు.
ఇవి కూడా చదవండి: Sonia Gandhi: మహిళలను కించపర్చే ప్రశ్నలా.. సీబీఎస్‌ఈ టెన్త్ క్లాస్ సిలబస్‌పై సోనియా తీవ్ర అభ్యంతరం..
వీడి వేశాలు పాడుగాను.. ఆర్డర్ చేసి రిజక్ట్ చేశాడు.. కారణం ఏంటో తెలిస్తే షాకే..