AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడి వేశాలు పాడుగాను.. ఆర్డర్ చేసి రిజక్ట్ చేశాడు.. కారణం ఏంటో తెలిస్తే షాకే..

ఐస్ క్రీం తినాలనే కోరిక లేని వారు ఎవరుంటారు చెప్పండి. కొంతమంది తమ కోరిక తీర్చుకోవడానికి వెంటనే ఐస్ క్రీం షాప్‌కి పరుగులు పెడుతుంటారు. కొందరు ఐస్ క్రీం ఆర్డర్ చేసి..

వీడి వేశాలు పాడుగాను.. ఆర్డర్ చేసి రిజక్ట్ చేశాడు.. కారణం ఏంటో తెలిస్తే షాకే..
Ice Cream
Sanjay Kasula
|

Updated on: Dec 13, 2021 | 3:31 PM

Share

Ice Cream is Too Cold: ఐస్ క్రీం తినాలనే కోరిక లేని వారు ఎవరుంటారు చెప్పండి. కొంతమంది తమ కోరిక తీర్చుకోవడానికి వెంటనే ఐస్ క్రీం షాప్‌కి పరుగులు పెడుతుంటారు. కొందరు ఐస్ క్రీం ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకుంటారు. అంతే చలికాలంలో చల్ల చల్లని ఐస్ క్రీం తినాలాని చాలా మందికి ఉంటుంది కాదా? అయితే యూకేలో నాలుగు మిల్క్‌షేక్‌లు, చీజ్‌కేక్, ఐస్‌క్రీం ఆర్డర్‌ చేసిన ఓ వ్యక్తి  ఆ తర్వాత వాటిని తిప్పి పంపించాడు. ఇందుకు అతను చెప్పిన కారణం చాలా ఆసక్తికరంగా ఉంది. ఐస్ క్రీం చల్లగా ఉందని పేర్కొన్నాడు. చట్ట ప్రకారం వినియోగదారునికి డబ్బు తిరిగి చెల్లించారు ఆర్డర్ తీసుకున్న కంపెనీ. రిజక్ట్  ఎందుకు చేసేడో కూడా తెలిపాడు. ఇది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

కొంతమంది కస్టమర్‌లు ఫుడ్ సర్వీస్ కంపెనీ కొత్త రీఫండ్ పాలసీలో లొసుగులను వెతుకుతున్నారు. ఆ తర్వాత అటువంటి వాడుకుంటారు. మాంచెస్టర్ ఈవెనింగ్ న్యూస్ ప్రచూరించిన కథనం ప్రకారం.. జస్ట్ ఈట్ యాప్ ద్వారా ఆర్డర్ చేసిన వ్యక్తులు ఇలాంటి విచిత్రమైన కారణాల వల్ల తమ డబ్బును తిరిగి పొందుతున్నారట.

ఈ విధానం కష్టాన్ని యాప్‌తో పనిచేసే హోటల్ యజమానులు భరిస్తున్నారు. కోల్డ్ ఐస్ క్రీం కారణంగా తిరిగి చెల్లించవలసి వచ్చిన ఓల్డ్‌హామ్‌లోని లక్కీస్ డైనర్ రెస్టారెంట్ యజమాని హసన్ హబీబ్, కస్టమర్‌లు విచిత్రమైన రీఫండ్ అభ్యర్థనలతో తన వద్దకు వస్తున్నారని ఫిర్యాదు చేశాడు.

ఐస్‌క్రీమ్‌కి రీఫండ్‌లు చెల్లించమని కస్టమర్ బలవంతం చేయవలసివచ్చినప్పుడు కొన్నిసార్లు తప్పులు జరుగుతాయని హబీబ్ అంగీకరించారు. అలాంటి సందర్భాలలో వారు తమ కస్టమర్‌లకు ఆహారం లేదా పూర్తిగా డబ్బులను వాపసు ఇవ్వడం ద్వారా దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తారు. కానీ “కొందరు విచిత్రమైన కస్టమర్లు” ఈ లొసుగును దుర్వినియోగం చేసి తమ వ్యాపారాన్ని దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తుంటారని హబీబ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి: PM Narendra Modi: వారణాసిలో ప్రధాని మోడీ పర్యటన.. కాళభైరవుడికి మోడీ హారతి, గంగా నదిలో పవిత్ర స్నానం

Republic Day 2022: ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు కేంద్ర ప్రభుత్వం ఊహాత్మకంగా అడుగు.. మధ్య ఆసియా ఐదు దేశాలకు ఆహ్వానం..