AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: వారణాసిలో ప్రధాని మోడీ పర్యటన.. కాళభైరవుడికి మోడీ హారతి, గంగా నదిలో పవిత్ర స్నానం

వారణాసిలో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధికి ఉద్దేశించిన మెగా ప్రాజెక్ట్ కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.

PM Narendra Modi: వారణాసిలో ప్రధాని మోడీ పర్యటన.. కాళభైరవుడికి మోడీ హారతి, గంగా నదిలో పవిత్ర స్నానం
Pm Modi Ganga Snan
Balaraju Goud
|

Updated on: Dec 13, 2021 | 1:43 PM

Share

PM Modi in Varanasi Kashi Vishwanath Dham: వారణాసిలో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధికి ఉద్దేశించిన మెగా ప్రాజెక్ట్ కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరికాసేపట్లో ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం వారణాసి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీ, కాలభైరవ ఆలయాన్ని సందర్శించారు. కాలభైరవ దేవాలయంలో ప్రధాని మోడీ హారతి కార్యక్రమం నిర్వహించారు. కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్‌కు ప్రధాని మోడీ మార్చి 8, 2019న శంకుస్థాపన చేశారు. ఇది 5 లక్షల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో విస్తరించిన ఆలయం నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. భక్తులకు వివిధ సౌకర్యాలు కల్పించేందుకు 23 కొత్త భవనాలను నిర్మించారు.

కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాసేపట్లో ప్రారంభించనున్నారు. కాశీ విశ్వనాథుడి ఆలయ పనులు,గంగానదిని కలుపుతూ నిర్మించిన కారిడార్‌ను మోదీ జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో వివిధ మఠాలకు చెందిన మూడు వేల మంది సాధువులు, మతపెద్దలు, కళాకారులతో పాటు పురప్రముఖులు పాల్గొన్నారు. వీరితో పాటు BJP పాలిత రాష్ట్రాలకు చెందిన 12 మంది CMలు హాజరవుతారు. అంతకుముందు కాలభైరవ ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత గంగానదిలో డబుల్‌ డెక్కర్‌ షిప్‌పై ప్రయాణించారు. ఉత్తరప్రదేశ్‌ CM యోగి ఆదిత్యానాథ్ దాస్‌తో కలిసి ఆయన షిప్‌లో విహారించారు.

వారణాసిలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, గంగా నదిలో పవిత్ర స్నానం అచరించారు. అనంతరం కాశీ విశ్వనాథ మెగా ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

అనంతరం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యానాథ్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.

కాశీ కారిడార్‌ ప్రత్యేకతలు 1669లో అహిల్యాబాయి హోల్కర్ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆ తర్వాత దాదాపు 350 ఏళ్లకు ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ విస్తరణ, పునరుద్ధరణ కోసం 2019 మార్చి 8న విశ్వనాథ్ ఆలయ కారిడార్‌కు శంకుస్థాపన చేశారు. అది జరిగిన దాదాపు రెండేళ్ల 8 నెలలకు ఇప్పుడు ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో 95 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం కారిడార్‌ నిర్మాణానికి రూ.340 కోట్లు వ్యయం చేశారని భావిస్తున్నారు.

మొత్తం కారిడార్‌ను దాదాపు 50 వేల చదరపు మీటర్ల ఒక పెద్ద ప్రాంగణంగా నిర్మించారు. దీని ప్రధాన ప్రవేశ మార్గం గంగానది వైపు లలితా ఘాట్ నుంచి ఉంటుంది. విశ్వనాథ్ కారిడార్‌ను మొత్తం 3 భాగాలుగా విభజించారు. మొదటిది ఆలయ ప్రధాన భాగం. దీనిని రెడ్ శాండ్ స్టోన్‌తో నిర్మించారు. ఇందులో నాలుగు పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయి. ఇందులో ఒక ప్రదక్షిణ మార్గం కూడా నిర్మించారు. ఆ ప్రదక్షిణ మార్గంలో 22 మార్బుల్స్ మీద కాశీ మహిమను వర్ణించే వివరాలు చెక్కారు.

ఈ కారిడార్‌లో 24 భవనాలు కూడా నిర్మించారు. వీటిలో ప్రధాన ఆలయ ప్రాంగణం, ఆలయ చౌరస్తా, ముముక్షు భవన్, యాత్రికుల వసతి కేంద్రం, షాపింగ్ కాంప్లెక్స్, మల్టీపర్పస్ హాల్, సిటీ మ్యూజియం, వారణాసి గ్యాలరీ, గంగా వ్యూ కెఫే రెస్టారెంట్ ఉన్నాయి. ఈ ధామ్‌ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా ప్రాంగణం చుట్టూ 5 వేలకు పైగా లైట్లు ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ లైట్లు పగటి పూట, మధ్యాహ్నం, రాత్రి రంగులు మారుతూ ఉంటాయి.