Royal Enfield: త్వరలో మార్కెట్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350.. రాజసం మామూలుగా లేదుగా..!

Royal Enfield: త్వరలో మార్కెట్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350.. రాజసం మామూలుగా లేదుగా..!
Hunter 350

Royal Enfield Hunter 350: ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్.. 2022లో తన కస్టమర్లకు సరికొత్త సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. 2022లో రాయల్..

Shiva Prajapati

|

Dec 13, 2021 | 1:09 PM

Royal Enfield Hunter 350: ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్.. 2022లో తన కస్టమర్లకు సరికొత్త సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. 2022లో రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సిసి ఇంజన్ సామర్థ్యంతో కనీసం నాలుగు కొత్త బైక్స్‌ని విడుదల చేయాలని యోచిస్తోంది. దీని ప్రకారం.. వచ్చే ఏడాది కంపెనీ ప్రతి త్రైమాసికంలో ఒక కొత్త మోడల్‌ను విడుదల చేసేందుకు ప్లాన్స్ సిద్ధం చేసింది. ప్రస్తుతం స్క్రమ్ 411, హంటర్ 350 అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. స్క్రమ్ 411 ఫిబ్రవరిలో, హంటర్ 350 వచ్చే ఏడాది మధ్యలో భారత మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేయనున్న ‘హంటర్ 350’ బైక్‌కు సంబంధించి టీజర్‌ను విడుదల చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో దీనిని విడుదల చేశారు. హంటర్ 350 కి సింగిల్ సీట్‌తో ఉంది. హంటర్ 350, ఇంచుమించుగా మెటోర్ 350 ని పోలి ఉంటుంది. ఇంజన్ సామర్థ్యం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో చౌకైన బైక్‌లలో ఇది ఒకటి. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి కొత్త J-ప్లాట్‌ఫారమ్ ఆధారంగా, హంటర్ 350 349 cc ఇంజిన్‌తో అందించబడుతుంది. ఇది గరిష్టంగా 22 బిహెచ్‌పి పవర్, 26 ఎంఎం టార్క్‌ను పొందుతుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ని కలిగి ఉంటుంది. ధర వివరాలు ఇంకా ప్రకటించలేదు.

ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రమ్ 411.. హిమాలయన్ మోడల్‌గా ఉండనుంది. దాని రూపురేఖలు, ఫీచర్లు, అన్నీ భారతీయ రోడ్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించడం జరిగింది. RE స్క్రామ్ 411 ముందు భాగంలో పొడవైన విండ్‌స్క్రీన్, స్ప్లిట్ సీట్లు, స్టాండర్డ్ లగేజ్ ర్యాక్, పెద్ద ఫ్రంట్ వీల్‌కు బదులుగా చిన్న చక్రాలు, తక్కువ సస్పెన్షన్ ట్రావెల్, సింగిల్ సీట్, వెనుక పిల్లర్ గ్రాబ్ హ్యాండిల్‌ ఉంటుంది. ఇది మరింత హైవే క్రూజింగ్ మెషీన్‌గా మార్చడంలో ప్రభావవంతంగా ఉంటుంది. బైక్ పవర్ ప్లాంట్ ఎంత అనేది ధృవీకరించలేదు. అయితే ఇది LS410, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, SOHC ఇంజిన్‌తో అందించబడుతుందని సమాచారం. దీని ఇంజిన్ 24.3 Bhp శక్తిని, 32 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. అయితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ మోటార్‌ సైకిల్ కోసం ఇంజన్‌ను కొద్దిగా భిన్నంగా ట్యూన్ చేసినట్లు సమాచారం.

Also read:

Amaragiri Trip : తెలంగాణ ఊటీ.. దేశంలోనే ఓ అద్భుత పర్యాటక కేంద్రం మన అమరగిరి..!

Narendra Modi In Varanasi: మరోసారి సింప్లిసిటీ చాటుకున్న ప్రధాని మోదీ.. ఓ సామాన్య వ్యక్తి అందించిన..

Home Insurance Policy: గృహ బీమాలో వరద నష్టానికి పరిహారం చెల్లిస్తారా?.. కీలక విషయాలు ఇప్పుడే తెలుసుకోండి..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu