Home Insurance Policy: గృహ బీమాలో వరద నష్టానికి పరిహారం చెల్లిస్తారా?.. కీలక విషయాలు ఇప్పుడే తెలుసుకోండి..!
Home Insurance Policy: దేశంలో ఇప్పుడు వరదలు సర్వసాధారణంగా మారాయి. వర్షాకాలంలోనే కాదు.. కాలాతీతంగా వరదలు, విపత్తులు వస్తున్నాయి.
Home Insurance Policy: దేశంలో ఇప్పుడు వరదలు సర్వసాధారణంగా మారాయి. వర్షాకాలంలోనే కాదు.. కాలాతీతంగా వరదలు, విపత్తులు వస్తున్నాయి. దేశంలో ఏ దిక్కున చూసినా ఎప్పుడూ ఏదో ఒక విపత్తు తలెత్తుతూనే ఉంది. ఇటీవల, రుతుపవనాలు తిరోగమన సమయంలో దిక్షిణాది రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు భారీ వరదలకు గురవుతున్నాయి. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ విధ్వంసం చోటుచేసుకుంటుంది. తెలంగాణలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇక వర్షాకాలం వచ్చిందంటే.. యూపీ, బీహార్‌లలో వరదలు సర్వసాధారణం. వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులు అవుతున్నారు. వరదల్లో ఇళ్లు కొట్టుకుపోవడం, కూలిపోవడం ఘటనలు అనేకం చూస్తూనే ఉన్నాం.
మరి ఇలాంటి పరిస్థితుల్లో గృహ బీమా తీసుకుంటే వరదల వల్ల జరిగిన నష్టానికి పరిహారం అందుతుందా? అంటే.. గృహ బీమాలో అగ్నిప్రమాదం, భూకంపం లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను కవర్ చేసే సదుపాయం ఉంది. ఇందులో వరదకు సంబంధించిన నిబంధన కూడా ఉంది. కానీ, మీరు బీమాలో వరద కవర్‌ను యాడ్ చేయాల్సి ఉంటుంది. మీరు మంచి గృహ బీమా పథకాన్ని తీసుకున్నట్లయితే ఇంటి నష్టాన్ని భర్తీ చేయడమే కాకుండా ఇంట్లో ఉన్న వస్తువులకు కూడా పరిహారం లభిస్తుంది. వరద ప్రళయానికి గృహ బీమా పాలసీలను విక్రయించే అనేక బీమా కంపెనీలు మార్కెట్‌లో ఉన్నాయి. మీరు ఈ బీమా ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో ఇంటి నష్టంతో పాటు వస్తువుల నష్టాన్ని కూడా భర్తీ చేస్తారు.
ఆన్‌లైన్‌లో బీమా తీసుకోవచ్చు.. వరద బీమా పథకాలకు ఎక్కువ కాలం ఉంటుంది. దీనితో, మీ ఇంటికి ఎక్కువ రోజుల బీమా లభిస్తుంది. షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదాలు కూడా ఈ ప్లాన్‌లో యాడ్ చేయబడతాయి. ఈ ప్లాన్ తీసుకోవడానికి మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత కావాలంటే బీమా మొత్తాన్ని కూడా పెంచుకోవచ్చు. వరదలు లేదా ఇతర విపత్తులు సంభవించినప్పుడు, కంపెనీ సర్వేను త్వరగా పూర్తి చేయడం ద్వారా క్లెయిమ్ పరిష్కరించబడుతుంది. ఎలాంటి జాప్యాలు కూడా ఉండవు.
మూడు రకాల వరదల నుండి రక్షణ.. నది వరద, ఆనకట్ట తెగిపోవడం: నదిలో నీటి మట్టం పెరిగి పరిసర ప్రాంతాలు ముంపునకు గురవడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఉపద్రవాలకు కూడా బీమా వర్తిస్తుంది. అలాగే ఆనకట్ట తెగకపోయినా, నదిలోని నీరు డ్యామ్ మీదుగా ప్రవహించి పరిసర ప్రాంతాలు ముంపునకు గురైనా బీమా వర్తిస్తుంది. వర్షం కారణంగా వరదలు: భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ఇల్లు, ఇంట్లోని వస్తువులు దెబ్బతింటే బీమా కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. తీర ప్రాంతాల వరదలు: తీరప్రాంతాల్లోని ఆటుపోట్ల కారణంగా వరదలు సంభవించి తీరప్రాంత ఇళ్లు నీట మునిగటం చాలా సందర్భాల్లో చూడొచ్చు. ఈ కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభస్తాయి. ఇళ్లు, ఇంట్లోని వస్తువులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. మీరు ఒకవేళ వరద బీమా తీసుకుంటే.. నష్ట పరిహారం కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఈ విషయాలను గుర్తుంచుకోండి.. ఒకవేళ అకాల వర్షాలకు నష్టపోయినా, ఇల్లు దెబ్బతిన్నా, వస్తువులు నష్టపోయినా.. వాటికి సంబంధించిన ఫోటో తీసి మీ దగ్గర ఉంచుకోండి. ధ్వంసమైన వస్తువులను కూడా ఉంచుకోవచ్చు. తద్వారా బీమా కంపెనీ వారు క్లెయిమ్ సర్వే కోసం వచ్చినప్పుడు రుజువుగా వాటిని చూపవచ్చు. ఒకవేళ విరిగిన వస్తువులు మరమ్మతు చేయిస్తే.. దానికి సంబంధించిన బిల్లింగ్ పేపర్స్‌ని, రసీదుని చూపించి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ రసీదు లేకపోతే క్లెయిమ్ చేయడానికి ఆస్కారం ఉండదు.
Also read:
Wood Smuggling: ప్రాణహిత అడ్డాగా మంచిర్యాలకు ‘మహా’ కలప.. విలువ తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం..!
Viral Video: పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన.. వైరల్ అవుతున్న వీడియో.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు..!