Amazon Prime Membership: అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఇకపై మరింత ప్రియం.. నేడే లాస్ట్ ఛాన్స్.. లేదంటే..

Amazon Prime Membership Price: ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ తన ప్రైమ్ మెంబర్‌షిప్ ధరలను పెంచబోతోంది. డిసెంబర్ 13 తర్వాత భారతదేశంలో ప్రైమ్ మెంబర్‌షిప్

Amazon Prime Membership: అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఇకపై మరింత ప్రియం.. నేడే లాస్ట్ ఛాన్స్.. లేదంటే..
Amazon Prime
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 13, 2021 | 11:16 AM

Amazon Prime Membership Price: ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ తన ప్రైమ్ మెంబర్‌షిప్ ధరలను పెంచబోతోంది. డిసెంబర్ 13 తర్వాత భారతదేశంలో ప్రైమ్ మెంబర్‌షిప్ ధర 50% పెరుగుతుంది. దాంతో డిసెంబర్ 14 నుంచి అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ మరింత ప్రియం కానుంది. అక్టోబర్‌లో ప్రైమ్ మెంబర్‌షిప్ ఫీజులను పెంచుతున్నట్లు అమెజాన్ ప్రకటించింది. అయితే, యూఎస్ ఈ-కామర్స్ దిగ్గజం దానికి సంబంధించిన తేదీని అప్పుడు వెల్లడించలేదు. తాజాగా ప్రకటించింది.

తాజా ప్రకటన ప్రకారం.. అమెజాన్ ప్రైమ్ వార్షిక సభ్యత్వం ఇప్పుడున్న రూ. 999 నుంచి రూ. 1,499 లకు పెరుగుతుంది. కొత్త ధరలు డిసెంబర్ 14 నుంచి అమలులోకి రానున్నాయి. అంటే కస్టమర్‌లు తమ సబ్‌స్క్రిప్షన్‌ను పాత ధరలకు (అంటే సంవత్సరానికి రూ. 999) డిసెంబర్ 13 అర్ధరాత్రి వరకు చేసుకోవచ్చు. అమెజాన్ కొత్త ధరలు నెలవారీ, త్రైమాసిక, వార్షిక ప్యాక్‌లన్నింటికీ వర్తిస్తాయి. అమెజాన్ ప్రైమ్ నెలవారీ ప్యాక్ ఇప్పుడు రూ. 129 లకు బదులుగా రూ.179 లకు అందుబాటులో ఉంటుంది. ఇప్పటి వరకు రూ. 329 గా ఉన్న మూడు నెలల ప్యాక్.. ఇక నుంచి రూ. 459 లకు పెరిగింది. అయితే, డిసెంబర్ 13, 2021 రాత్రి 11.59 గంటల వరకు కూడా ప్రస్తుతం ఉన్న ధరల ప్యాక్‌లే ఉంటాయి. ఆ లోపు ప్రైమ్‌లో చేరిన వారికి పెరిగిన ధరలు వర్తించవు. పాత ధరలు మాత్రమే వర్తిస్తాయని అమెజాన్ స్పష్టం చేసింది. తీసుకున్న ప్రైమ్ మెంబర్‌షిప్ ముగిసిన తరువాత కొత్త ధరలు చెల్లించాల్సి ఉంటుంది.

అమెజాన్ ప్రైమ్ కేటలాగ్‌కు అపరిమిత యాక్సెస్‌తో పాటు వినియోగదారులు అమెజాన్ మ్యూజిక్‌తో యాడ్-ఫ్రీ 70 మిలియన్ పాటలను కూడా పొందుతారు. ఇటీవల, డిస్నీ+ హాట్‌స్టార్ కొత్త ప్లాన్‌లను కూడా ప్రవేశపెట్టింది. ఇది ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా ప్రభావితం చేసింది. డిస్నీ+ హాట్‌స్టార్ కొత్త ప్లాన్‌లు ఇప్పుడు రూ.499తో ప్రారంభమవుతాయి. స్ట్రీమింగ్ దిగ్గజం డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాన్‌ను రద్దు చేసింది. ఇది రూ. 399తో ప్రారంభమైంది. ఇక Netflix సబ్‌స్క్రిప్షన్ కనీస ధర రూ. 200, వార్షిక సభ్యత్వం రూ. 2000 కంటే ఎక్కువే.

Also read:

Wood Smuggling: ప్రాణహిత అడ్డాగా మంచిర్యాలకు ‘మహా’ కలప.. విలువ తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం..!

Viral Video: పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన.. వైరల్ అవుతున్న వీడియో.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు..!

Rohit Sharma: సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజున కెప్టెన్‌గా దుమ్ము రేపిన రోహిత్ శర్మ.. కేవలం 25 బంతుల్లోనే..

రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..
రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..
మీరు ఎక్కాల్సిన ట్రైన్.. లేటు కాదు.. గతంలో చూడనంత గ్రేట్!
మీరు ఎక్కాల్సిన ట్రైన్.. లేటు కాదు.. గతంలో చూడనంత గ్రేట్!
ఓరీ దేవుడో ఇదేం వింతకాఫీరా సామీ..!రుచి గురించి వింటే షాక్ తింటారు
ఓరీ దేవుడో ఇదేం వింతకాఫీరా సామీ..!రుచి గురించి వింటే షాక్ తింటారు
ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆధిక్యం ఎంతంటే?
ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆధిక్యం ఎంతంటే?
పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు..
న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు..
ప్రేమలో పడ్డ శ్రీలీల.. త్వరలోనే..
ప్రేమలో పడ్డ శ్రీలీల.. త్వరలోనే..
మరీ లక్షల్లో ఏంటి గురూ..!ఈటోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులుఔట్
మరీ లక్షల్లో ఏంటి గురూ..!ఈటోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులుఔట్
టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. రెండో భారత ఆటగాడిగా రిషబ్ పంత్..
టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. రెండో భారత ఆటగాడిగా రిషబ్ పంత్..
బ్లాక్ చీతాను ఎప్పుడైనా చూశారా..? వీడియో చూస్తే షాకవ్వాల్సిందే
బ్లాక్ చీతాను ఎప్పుడైనా చూశారా..? వీడియో చూస్తే షాకవ్వాల్సిందే