- Telugu News Photo Gallery Cricket photos On This Day in Cricket Team Indian Batsman Rohit Sharma hits 3rd ODI Double Hundred Scores 208 not out vs Sri Lanka Full Details Here
Rohit Sharma: సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజున కెప్టెన్‌గా దుమ్ము రేపిన రోహిత్ శర్మ.. కేవలం 25 బంతుల్లోనే..
Rohit Sharma: హిట్‌మాన్ రోహిత్ శర్మ.. టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌తో కెప్టెన్‌గా రోహిత్ తన ప్రస్థానాన్ని..
Updated on: Dec 13, 2021 | 9:33 AM

Rohit Sharma: హిట్‌మాన్ రోహిత్ శర్మ.. టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌తో కెప్టెన్‌గా రోహిత్ తన ప్రస్థానాన్ని ప్రారంభించనున్నాడు. అయితే, 4 ఏళ్ల క్రితం ఇదే డిసెంబర్ నెలలో.. తొలిసారిగా వన్డేల్లో భారత జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేజిక్కించుకున్నాడు రోహిత్ శర్మ. ఆ సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో పరుగుల తుపాను సృష్టించాడు. హిట్‌మాన్ దెబ్బకు ప్రత్యర్థి బౌలర్లు బిత్తరపోయారు.

సరిగ్గా 4 సంవత్సరాల క్రితం ఇదే రోజున అంటే 13 డిసెంబర్ 2017. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ లేకపోవడంతో, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ టీమ్ ఇండియాకు కెప్టెన్సీ వహించాడు.ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో కేవలం 2 పరుగులకే ఔటైనా.. ధర్మశాలలో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం పూర్తి భిన్నమైన ప్రదర్శన చూపాడు. రీవేంజ్ తీర్చుకున్న మాదిరిగా డబుల్ సెంచరీ సాధించాడు.

దీంతో ఇప్పటి వరకు వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఓపెనింగ్‌లో రోహిత్ కేవలం 153 బంతుల్లో 208 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ సమయంలో రోహిత్ కేవలం 25 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సర్ల సహాయంతో 124 పరుగులు చేశాడు.

రోహిత్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా 70 బంతుల్లో 88 పరుగులు చేయగా, శిఖర్ ధావన్ కూడా 68 పరుగులు చేశాడు. భారత్ 4 వికెట్ల నష్టానికి 392 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దాదాపు శ్రీలంక బౌలర్లందరినీ చెడుగుడు ఆడుకున్నాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ నువాన్ ప్రదీప్ బౌలింగ్‌లో సినిమా చూపించారు. అతను వేసిన 10 ఓవర్లలో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 106 పరుగులు చేశారు.

భారత్ స్కోరు ముందు శ్రీలంక బేజార్ అయిపోయింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఒత్తిడికి లోనవడంతో వరుసగా వికెట్లు సమర్పించుకుంది. అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ మాత్రమే పోరాడి 111 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మొత్తం జట్టు 8 వికెట్ల నష్టానికి 251 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ తరఫున యుజ్వేంద్ర చాహల్ 60 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ 141 పరుగుల తేడాతో తొలి విజయాన్ని నమోదు చేసింది.





























