EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. రూ.23.34 కోట్ల వడ్డీని జమ చేసిన సంస్థ..
మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారా..? అయితే మీకిది శుభవార్తే. ఈపీఎఫ్‌వో తాజాగా పీఎఫ్ చందాదారులకు తీపికబురు అందించింది...
మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారా..? అయితే మీకిది శుభవార్తే. ఈపీఎఫ్‌వో తాజాగా పీఎఫ్ చందాదారులకు తీపికబురు అందించింది. పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ డబ్బులను జమ చేసినట్లు ప్రకటించింది. ఈపీఎఫ్‌వో రూ.23.34 కోట్లను పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ చేసినట్లు ట్వీట్ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.5 శాతం వడ్డీ రేటును పీఎఫ్ అకౌంట్లలో డిపాజిట్ చేసినట్లు ఈపీఎఫ్‌వో వెల్లడించింది. పీఎఫ్ ఖాతాదారులు సులభంగానే వారి పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. తద్వారా వడ్డీ డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవచ్చు. ముందుగా ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కు వెళ్లాలి. UAN నెంబర్‌తో లాగిన్ అయి బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు.
23.34 crore accounts have been credited with an interest of 8.50% for the FY 2020-21. @LabourMinistry @esichq @PIB_India @byadavbjp @Rameswar_Teli
— EPFO (@socialepfo) December 13, 2021
ఎస్ఎంఎస్‌తో కూడా తెలుసుకోవచ్చు
పీఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడానికి మరో ఆప్షన్ కూడా ఉంది. అదే మిస్డ్ కాల్ సర్వీస్. 011-229014016 నెంబర్‌కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇచ్చి పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అయితే యూఏఎన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. అలా కాకుండా ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత పీఎఫ్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత UAN నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ రిజిస్టార్ మొబల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేస్తే లాగిన్ అవుతారు. అక్కడ పాస్‌బుక్‌పై క్లిక్ చేస్తే మీ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుస్తుంది.
Read Also.. Bank Fixed Deposit Rates: ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసా.. పూర్తి వివరాలకు..