ప్రతిరోజు రూ.417 పొదుపు చేయండి.. కోటి రూపాయలు సంపాదించండి..

PPF Account: పోస్టాఫీసులో పొదుపు మీ భవితకు మలుపు. మీకు వడ్డీతో పాటు మీ డబ్బుకి భద్రత కూడా ఉంటుంది. సామాన్య ప్రజానీకం కోసం

ప్రతిరోజు రూ.417 పొదుపు చేయండి.. కోటి రూపాయలు సంపాదించండి..
Rupee
uppula Raju

|

Dec 13, 2021 | 1:15 PM

PPF Account: పోస్టాఫీసులో పొదుపు మీ భవితకు మలుపు. మీకు వడ్డీతో పాటు మీ డబ్బుకి భద్రత కూడా ఉంటుంది. సామాన్య ప్రజానీకం కోసం ఇందులో ఎన్నో పొదుపు పథకాలు ఉన్నాయి. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్‌లో మీరు మిలియనీర్‌ కావొచ్చు. పోస్టాఫీసు పథకాలలో ఒకటైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో ప్రతిరోజు రూ.417 పెట్టుబడి పెట్టి కోటి రూపాయల ఫండ్ క్రియేట్‌ చేయవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

ప్రస్తుతం పీపీఎఫ్‌ ఖాతాకి ప్రభుత్వం 7.1 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు కానీ మీరు దీన్ని 5-5 సంవత్సరాలకు రెండుసార్లు పొడిగించవచ్చు. ఈ పథకం ప్రధాన పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ పథకంలో మెచ్యూరిటీ వరకు పెట్టుబడి పెడితే సంవత్సరానికి గరిష్టంగా రూ. 1.5 లక్షలు అవుతుంది. అంటే నెలకు రూ. 12,500 లేదా రోజుకు రూ. 417 డిపాజిట్ చేస్తే మీ మొత్తం పెట్టుబడి రూ. 22.50 లక్షలు అవుతుంది.

అంటే మీరు మెచ్యూరిటీ సమయంలో 7.1 శాతం వార్షిక వడ్డీతో పాటు చక్రవడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. మెచ్యూరిటీ సమయంలో మీరు వడ్డీగా రూ.18.18 లక్షలు పొందుతారు. అంటే మీకు రూ.40.68 లక్షలు వస్తాయి. ఇది కాకుండా మీరు మిలియనీర్ కావాలనుకుంటే మీరు ఈ పథకాన్ని 15 సంవత్సరాల తర్వాత 5-5 సంవత్సరాలకు రెండుసార్లు పెంచాలి. సంవత్సరానికి రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా మీ మొత్తం పెట్టుబడి రూ. 37.50 లక్షలు అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత, మీరు 7.1 శాతం వడ్డీ రేటుతో రూ. 65.58 లక్షలు పొందుతారు. అంటే 25 ఏళ్ల తర్వాత మీ మొత్తం ఫండ్ రూ.1.03 కోట్లు అవుతుంది.

PPF ఖాతాను ఎవరు తెరవగలరు? భారతదేశంలో నివసించే ఎవరైనా – జీతం పొందేవారు, స్వయం ఉపాధి పొందేవారు, పెన్షనర్లు మొదలైనవారు పోస్ట్ ఆఫీస్ PPFలో ఖాతాను ఓపెన్‌ చేయగలరు. ఈ పథకం ప్రతి వ్యక్తికి ఒక ఖాతాను అందిస్తుంది. ఖాతాను తెరవడానికి ఈ పత్రాలు అవసరం. – గుర్తింపు రుజువు – ఓటరు ID, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ – చిరునామా ప్రూఫ్- ఓటర్ ID, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ – పాన్ కార్డ్ – పాస్‌పోర్ట్ సైజు ఫోటో – నమోదు ఫారమ్ E

Yamaha FZS: యమహా ఎఫ్‌జెడ్ ఎస్‌ కేవలం 28 వేలు మాత్రమే..! డీల్‌ ఏంటో తెలుసా..?

ఆస్ట్రేలియాలో విధ్వంసం సృష్టించిన కరేబియన్‌ ఆల్‌రౌండర్.. కేవలం 21 బంతుల్లో మ్యాచ్‌ రూపురేఖలు మార్చేశాడు..

LIC Policy: ఎల్‌ఐసీ పాలసీ సరెండర్‌ చేస్తున్నారా.. కచ్చితంగా ఈ నియమాలు తెలుసుకోండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu