ఆస్ట్రేలియాలో విధ్వంసం సృష్టించిన కరేబియన్‌ ఆల్‌రౌండర్.. కేవలం 21 బంతుల్లో మ్యాచ్‌ రూపురేఖలు మార్చేశాడు..

Andre Russell: ఆండ్రీ రస్సెల్‌ని మరిచిపోయారా.. ఈ కరీబియన్‌ ఆల్‌రౌండర్‌ మళ్లీ బ్యాట్‌కి పనిచెప్పాడు. ప్రపంచ వ్యాప్తంగా లీగ్‌లు ఆడిన అనుభవం ఉన్న

ఆస్ట్రేలియాలో విధ్వంసం సృష్టించిన కరేబియన్‌ ఆల్‌రౌండర్.. కేవలం 21 బంతుల్లో మ్యాచ్‌ రూపురేఖలు మార్చేశాడు..
Andre Russell
Follow us
uppula Raju

|

Updated on: Dec 13, 2021 | 11:00 AM

Andre Russell: ఆండ్రీ రస్సెల్‌ని మరిచిపోయారా.. ఈ కరీబియన్‌ ఆల్‌రౌండర్‌ మళ్లీ బ్యాట్‌కి పనిచెప్పాడు. ప్రపంచ వ్యాప్తంగా లీగ్‌లు ఆడిన అనుభవం ఉన్న ఈ ఆటగాడు ఆస్ట్రేలియా పిచ్‌పై బౌలర్లను ఊచకోతకోస్తున్నాడు. తాజాగా రస్సెల్ తుఫాను ఇన్నింగ్స్‌ బిగ్ బాష్ లీగ్‌లో కనిపించింది. సిడ్నీ థండర్, మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రస్సెల్ మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేసింది.

సిడ్నీ థండర్ తరఫున అలెక్స్ రాస్ 49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున కైస్ అహ్మద్, బ్రాడీ కౌచ్ 2-2 వికెట్లు పడగొట్టి విజయవంతమైన బౌలర్లుగా నిలిచారు. ఆండ్రీ రస్సెల్ ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చాడు. కానీ వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. బంతితో వైఫల్యం చెందినా బ్యాట్‌తో రచ్చ చేశాడు. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్‌బోర్న్ స్టార్స్ 12వ ఓవర్లో 83 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో క్రీజులోకి దిగగానే తుపాను సృష్టించడం మొదలుపెట్టి చివరి వరకు అజేయంగా తన జట్టును గెలిపించి వెనుదిరిగాడు.

6 బంతుల్లో 34 రస్సెల్ 21 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్‌తో 5 సిక్స్‌లు, 1 ఫోర్‌తో అజేయంగా 42 పరుగులు చేశాడు. అంటే తన విలువైన ఇన్నింగ్స్‌లో కేవలం 6 బంతుల్లో 34 పరుగులు రాబట్టాడు. 5 సిక్సర్లతో, మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. రస్సెల్ సృష్టించిన ఈ తుఫాను ప్రభావంతో మెల్‌బోర్న్ స్టార్స్ 17.1 ఓవర్లలో 152 పరుగుల లక్ష్యాన్ని 17 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. ఈ లీగ్‌లో ఆండ్రీ రస్సెల్ నేతృత్వంలోని 3 మ్యాచ్‌ల్లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు ఇది రెండో విజయం. 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన కరేబియన్ ఆల్ రౌండర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

LIC Policy: ఎల్‌ఐసీ పాలసీ సరెండర్‌ చేస్తున్నారా.. కచ్చితంగా ఈ నియమాలు తెలుసుకోండి..

Infinix: ఇండియాలో ఈరోజు 2 స్మార్ట్‌ఫోన్లు విడుదల.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

ఈ 5 రాశుల వారు విడిపోయిన వారి మాజీలతో మళ్లీ కలుస్తారు..! ఎందుకంటే..?

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!