Virat Kohli: టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోహ్లీని వ్యక్తిగతంగా అభ్యర్థించా.. కానీ అతను వైదొలిగాడు..!

భారత జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్సీ మార్పుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడారు. టీ20 కెప్టెన్సీ బాధ్యతలను వదులుకోవద్దని కోహ్లీని వ్యక్తిగతంగా అభ్యర్థించినట్లు తెలిపారు...

Virat Kohli: టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోహ్లీని వ్యక్తిగతంగా అభ్యర్థించా.. కానీ అతను వైదొలిగాడు..!
Virat Kohli
Follow us

|

Updated on: Dec 13, 2021 | 10:49 AM

భారత జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్సీ మార్పుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడారు. టీ20 కెప్టెన్సీ బాధ్యతలను వదులుకోవద్దని కోహ్లీని వ్యక్తిగతంగా అభ్యర్థించినట్లు బోర్డు అధ్యక్షుడు తెలిపారు. సెప్టెంబరులో పొట్టి ఫార్మాట్‌ నుంచి కోహ్లీ భారత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కోహ్లీ టీ20 కెప్టెన్‌గా వైదొలిగిన మూడు నెలల తర్వాత, BCCI వన్డే కెప్టెన్‌గా అతన్ని తొలగించింది. అతని స్థానంలో ఓపెనర్ రోహిత్ శర్మను నియమించింది.

” టీ20 కెప్టెన్సీని వదులుకోవద్దని నేను అతనిని (కోహ్లీ) వ్యక్తిగతంగా అభ్యర్థించాను. సహజంగానే అతనిపై పనిభారం ఉంటుంది. అతను గొప్ప క్రికెటర్. అతను చాలా కాలం పాటు కెప్టెన్‌గా ఉన్నాడు. కెప్టెన్ మార్పులు జరుగుతాయి. ఎందుకంటే నేను చాలా కాలం పాటు కెప్టెన్‌గా పనిచేశాను కాబట్టి, నాకు తెలుసు. అలాగే వారు ఒక వైట్-బాల్ కెప్టెన్‌ని మాత్రమే కోరుకున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. నాకు తెలియదు భవిష్యత్తులో ఏమి జరగబోతోంది. కానీ ఇది మంచి జట్టు, అద్భుతమైన ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. వారు బాగా ఆడతారని నేను ఆశిస్తున్నాను” అని గంగూలీ న్యూస్ 18తో అన్నారు.

” పనిభారాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. గత 8-9 సంవత్సరాలుగా నా అపారమైన పనిభారాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మొత్తం 3 ఫార్మాట్‌లను ఆడుతూ, గత 5-6 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాను. నాయకత్వానికి పూర్తిగా సిద్ధంగా ఉండటానికి నేను భారం తగ్గించుకోవాలని చూస్తున్నాను. అందుకే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాను ” అని కోహ్లి అప్పట్లో పేర్కొన్నాడు.

Read Also.. IND Vs SA: తుది జట్టులో రహానెకు చోటు లభించడం కష్టమే.. అయ్యర్, విహారి నుంచి పోటీ ఉంటుందన్న గంభీర్..