Harbhajan Singh: బీజేపీలో చేరికపై మీడియాలో పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన హర్భజన్ సింగ్..
భారత మాజీ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు పుకార్లు వచ్చాయి. అనేక మీడియా సంస్థలు దీనిపై రాశాయి...
భారత మాజీ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు పుకార్లు వచ్చాయి. అనేక మీడియా సంస్థలు దీనిపై రాశాయి. ఢిల్లీ క్రౌన్ అనే మీడియా సంస్థ .. హర్భజన్ సింగ్‌ను ఒక ట్వీట్‌లో ట్యాగ్ చేసింది. పంజాబ్ బీజేపీ హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్‌పైదృష్టి పెట్టిందని.. వారిద్దరూ త్వరలో బీజేపీలో చేరవచ్చు అని ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్‌పై హర్భజన్ సింగ్ స్పందించాడు. “ఫేక్ న్యూస్” అంటూ కొట్టిపడేశాడు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని భజ్జీ స్పష్టం చేశాడు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ప్రజలు పట్టించుకోరాద్దని సూచించాడు. 2017లో కూడా హర్భజన్ సింగ్‌పై ఇలాంటి ప్రచారమే జరిగింది. అతను కాంగ్రెస్ చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ ట్వీట్ పై యువరాజ్ సింగ్ ఇప్పటి వరకు స్పందించలేదు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి. మార్చి 2022లో జరగనున్నాయి. 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. పంజాబ్ మాజీ సీఎంగా అమరీందర్ సింగ్ బాధ్యతలు చెపట్టారు. తర్వాత కాంగ్రెస్‌లో విభేదాల కారణంగా ఆయన రాజీనామా చేశారు. ప్రస్తుతం పంజాబ్ సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చిన్నీ ఉన్నారు.
Fake news https://t.co/nxy81qURPX
— Harbhajan Turbanator (@harbhajan_singh) December 11, 2021
Read Also.. Gautam Gambhir: ఆ నిర్ణయం భారత క్రికెట్‌కు మంచిదే.. రోహిత్ శర్మకు తగినంత సమయం దొరుకుతుంది..