Gautam Gambhir: ఆ నిర్ణయం భారత క్రికెట్‌కు మంచిదే.. రోహిత్ శర్మకు తగినంత సమయం దొరుకుతుంది..

రోహిత్ శర్మను వన్డే కెప్టెన్‎గా నియమించడంపై భారత మాజీ ఆటగాగడు గౌతమ్ గంభీర్ స్పందించాడు. కెప్టెన్సీ విడిపోవడం భారత క్రికెట్‌కు మంచిదని...

Gautam Gambhir: ఆ నిర్ణయం భారత క్రికెట్‌కు మంచిదే.. రోహిత్ శర్మకు తగినంత సమయం దొరుకుతుంది..
Gambir
Follow us

|

Updated on: Dec 13, 2021 | 8:16 AM

రోహిత్ శర్మను వన్డే కెప్టెన్‎గా నియమించడంపై భారత మాజీ ఆటగాగడు గౌతమ్ గంభీర్ స్పందించాడు. కెప్టెన్సీ విడిపోవడం భారత క్రికెట్‌కు మంచిదని, వైట్ బాల్ జట్టును తీర్చిదిద్దడానికి రోహిత్ శర్మకు మరింత సమయం దొరుకుతుందని చెప్పాడు. అతను స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడారు. “భారత క్రికెట్‌కు ఇప్పుడు ఇద్దరు కెప్టెన్‌లు లభించారని నేను భావిస్తున్నాను. రెడ్ బాల్ క్రికెట్‌లో ఒకరు, వైట్ బాల్ క్రికెట్‌లో ఒకరు. కాబట్టి వైట్-బాల్ జట్లను తీర్చిదిద్దడానికి రోహిత్‌కు తగినంత సమయం లభిస్తుంది. అది టీ20 ఫార్మాట్, ODI ఫార్మాట్ కావొచ్చు. ఒక నాయకుడిగా రోహిత్ శర్మ ఖచ్చితంగా భారత క్రికెట్‌కు బాగా రాణిస్తాడని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా, భారత క్రికెట్ చాలా సురక్షితమైన వారి చేతుల్లో ఉంది, ముఖ్యంగా వైట్-బాల్ క్రికెట్‌లో” అని గంభీర్ చెప్పాడు.

భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ విభజనపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తొలగించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత భారత వన్డే జట్టుకు నాయకత్వం వహించాలనుకుంటున్నట్లు కోహ్లీ గతంలో చెప్పాడు. టీ20 కెప్టెన్‌గా కొనసాగాలని గంగూలీ కోహ్లీని కోరాడు. అయితే అవుట్‌గోయింగ్ కెప్టెన్ అప్పటికే నిర్ణయం తీసుకున్నాడు. రోహిత్ ప్రశాంతత జట్టులోని ఆటగాళ్లకు సహాయపడుతుందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. “అదే సమయంలో అతని ప్రశాంతత, కొన్నిసార్లు అతని విశ్రాంతి వైఖరి కూడా, విషయాలను చాలా రిలాక్స్‌గా ఉంచుతుంది.” అని అన్నాడు.

Read Also.. IND vs SA: ఆయన లేకుండానే రోహిత్ సేన ఆసియా కప్ గెలిచింది: బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కీలక వ్యాఖ్యలు

ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి