AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: ఆయన లేకుండానే రోహిత్ సేన ఆసియా కప్ గెలిచింది: బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కీలక వ్యాఖ్యలు

Sourav Ganguly: విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను బీసీసీఐ వన్డే జట్టుకు కొత్త కెప్టెన్‌గా నియమించింది. ప్రస్తుతం రోహిత్ శర్మపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశాడు.

IND vs SA: ఆయన లేకుండానే రోహిత్ సేన ఆసియా కప్ గెలిచింది: బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కీలక వ్యాఖ్యలు
Ganguly
Venkata Chari
|

Updated on: Dec 13, 2021 | 6:45 AM

Share

India vs South Africa 2021-22: విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను బీసీసీఐ వన్డే జట్టుకు కొత్త కెప్టెన్‌గా నియమించింది. ప్రస్తుతం రోహిత్ శర్మపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశాడు. ఓ మీడియాతో దాదా మాట్లాడుతూ, ‘కొన్నేళ్ల క్రితం ఆడిన ఆసియా కప్ (2018)లో రోహిత్ కెప్టెన్సీలో జట్టు విజయం సాధించింది. విరాట్ కోహ్లీ ఆ జట్టులో లేడు. కోహ్లీ లేకుండానే జట్టు గెలిచిందంటే రోహిత్ కెప్టెన్సీలో మన జట్టు ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చంటూ బాంబ్ పేల్చాడు.

గంగూలీ ఇంకా మాట్లాడుతూ, ‘రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్, సెలెక్టర్లు అతనికి ఈ బాధ్యతను అప్పగించారు. అతను జట్టును చాలా దూరం తీసుకెళతాడు. అతని కెప్టెన్సీలో ముంబై జట్టు ఐపీఎల్‌లో ఐదుసార్లు టైటిల్‌ను గెలుచుకుంది. భారీ టోర్నీలో రోహిత్ తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. వారికి గొప్ప జట్టు ఉంది. టీమ్ ఇండియా మున్ముందు చాలా విజయాలు సాధిస్తుందని ఆశిస్తున్నాను’ అంటూ పేర్కొన్నాడు.

కెప్టెన్సీ నుంచి వైదొలగమని విరాట్‌ను మేం అడగలేదు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కొద్ది రోజుల క్రితం ఏఎన్‌ఐతో మాట్లాడుతూ, ‘రోహిత్‌ను కెప్టెన్‌గా చేయాలనే నిర్ణయం బీసీసీఐ, సెలెక్టర్లు కలిసి తీసుకున్నాయి. టీ20 కెప్టెన్సీని వదులుకోవద్దని బీసీసీఐ విరాట్‌ను కోరినప్పటికీ అతను అంగీకరించలేదని’ అన్నాడు.

గంగూలీ ఇంకా మాట్లాడుతూ, “పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇద్దరు వేర్వేరు కెప్టెన్లు ఉండకూడదని సెలక్టర్లు విశ్వసించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు విరాట్‌ టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతుండగా, వన్డే, టీ20కి రోహిత్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు’ అని తెలిపాడు.

కెప్టెన్సీ నుంచి విరాట్‌ను తొలగించిన తర్వాత బీసీసీఐ, సౌరవ్ గంగూలీలపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ జరుగుతోంది. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని కోహ్లీకి బోర్డు 48 గంటల అల్టిమేటం ఇచ్చినట్లు తెలిసిందే. ఎలాంటి స్పందన రాకపోవడంతో బోర్డు స్వయంగా ఆయనను ఈ పదవి నుంచి తొలగించడంతో విమర్శలు ఎక్కువ అయ్యాయి.

Also Read: IND vs AUS: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు.. కెప్టెన్సీ తొలి మ్యాచ్‌లో అదరగొట్టినా.. భారత జట్టుకు మాత్రం విజయం అందించలే..!

సీనియర్లకు చెక్ పెట్టనున్న ‘ఆ నలుగురు’.. టీమిండియాలో స్థిరమైన చోటు కోసం విధ్వంసాలు సృష్టిస్తోన్న యంగ్ ప్లేయర్స్..!