Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు.. కెప్టెన్సీ తొలి మ్యాచ్‌లో అదరగొట్టినా.. భారత జట్టుకు మాత్రం విజయం అందించలే..!

Virat Kohli: ఈ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విరాట్ కోహ్లి సెంచరీలు చేసినా జట్టును విజయ రథం ఎక్కించలేకపోయాడు.

IND vs AUS: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు.. కెప్టెన్సీ తొలి మ్యాచ్‌లో అదరగొట్టినా.. భారత జట్టుకు మాత్రం విజయం అందించలే..!
క్రికెట్ ప్రపంచంలో రన్ మెషీన్, కింగ్ కోహ్లిగా ప్రసిద్ధి చెందిన విరాట్ కోహ్లీ, కోవిడ్ కారణంగా ఎక్కువ మ్యాచ్‌లు లేని కారణంగా 2020లో ఈ ఫీట్ చేయడంలో దూరమయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ కాలం సెంచరీ చేయకుండానే 2021ని ముగిస్తున్నాడు.
Follow us
Venkata Chari

|

Updated on: Dec 13, 2021 | 6:40 AM

On This Day In Cricket: తాజాగా భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించారు. ఇప్పటికీ టెస్టుల్లో టీమిండియా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. కెప్టెన్‌గా కోహ్లీ అద్భుతంగా పనిచేసిన ఫార్మాట్‌లు ఇవి. అతని కెప్టెన్సీలో, జట్టు విదేశీ గడ్డపై భిన్నమైన ప్రదర్శన చేసింది. అనేక రికార్డులను కూడా సృష్టించింది. ఇందులో ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలవడం అతిపెద్ద విజయం. కోహ్లి కెప్టెన్సీ కెరీర్ కూడా ఆస్ట్రేలియా నుంచే ప్రారంభమైనప్పటికీ అది బాగాలేదు. మహేంద్ర సింగ్ ధోని 2014 ఆస్ట్రేలియా పర్యటనలో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత కోహ్లీని కెప్టెన్‌గా నియమించారు. కోహ్లి సారథ్యంలో డిసెంబర్ 9 నుంచి 13 వరకు అడిలైడ్‌లో టీమిండియా తన తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ చివరి రోజు కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ తో టీమిండియాకు అసాధ్యమైన విజయం కూడా సాధ్యమే అనిపించినా.. ఆ తర్వాత ఆట తారుమారైంది. ఈ రోజు మనం అదే టెస్ట్ మ్యాచ్ చివరి రోజు గురించి మరోసారి తెలుకోబోతున్నాం.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌ను ఏడు వికెట్లకు 517 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో పోరాడి 444 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ అత్యధికంగా 115 పరుగులు చేశాడు. అతనితో పాటు, ఛెతేశ్వర్ పుజారా 73, అజింక్యా రహానే 62, మురళీ విజయ్ 53 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఐదు వికెట్ల నష్టానికి 290 పరుగుల ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అందులో డేవిడ్ వార్నర్ అత్యధికంగా 103 పరుగులు చేశాడు.

చివరి రోజు 364 పరుగులు.. దీంతో ఆస్ట్రేలియా భారత్ ముందు 364 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. విరాట్ కోహ్లి దూకుడుకు పేరుగాంచాడు. చివరి క్షణం వరకు పట్టు వదలని, వందశాతం విజయాన్ని అందించిన ఆటగాళ్లలో అతడు ఒకడిగా పేరుగాంచాడు. టెస్టు మ్యాచ్‌లో చివరి రోజు 364 పరుగులను ఛేదించడం అంత తేలికైన విషయం కాదు. కానీ, అది కెప్టెన్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న టీమిండియా పోరాడింది. ఓపెనర్లు మురళీ విజయ్‌, విరాట్‌ కోహ్లి రెండో వికెట్‌కు 185 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతకుముందు వరకు భారత్ రెండు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఈ చివరి సెషన్ టీమ్ ఇండియాకు చాలా కీలకమైనది.

విరాట్ కోహ్లి కూడా 100 పరుగులు పూర్తి చేశాడు. కానీ నాథన్ లియాన్ 242 పరుగుల వద్ద విజయ్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. విజయ్ 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. తన ఇన్నింగ్స్‌లో 234 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లతో పాటు రెండు సిక్సర్లు బాదాడు. భారత్ ఆరంభంలోనే అజింక్యా రహానే (0), రోహిత్ శర్మ (6), వృద్ధిమాన్ సాహా (13) వికెట్లను కోల్పోయింది. కానీ విరాట్ కోహ్లి నిలవడంతో భారత్ ఆశలు అతడిపైనే నిలిచాయి.

దీంతో భారత్ స్కోరు 300 దాటింది. కోహ్లి సారథ్యంలో విజయం కూడా సాధ్యమే అనిపించింది. బోర్డులో 304 పరుగులు నమోదయ్యాయి. ఆ తర్వాత విరాట్ కోహ్లి లయన్ బంతికి భారీ షాట్ ఆడాలనుకున్నాడు. మిచెల్ మార్ష్ అతని క్యాచ్‌ను బౌండరీలో అందుకున్నాడు. ఈ క్యాచ్‌తో భారత్‌ విజయంపై ఆశలు ఆగిపోయాయి. కోహ్లి 175 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 141 పరుగులు చేశాడు. భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 315 పరుగులకు ఆలౌటైంది.

Also Read: సీనియర్లకు చెక్ పెట్టనున్న ‘ఆ నలుగురు’.. టీమిండియాలో స్థిరమైన చోటు కోసం విధ్వంసాలు సృష్టిస్తోన్న యంగ్ ప్లేయర్స్..!

IND vs SA: విమర్శలతో మాకు పనిలేదు.. మా మధ్య బలమైన బంధం ఉంది.. జట్టు విజయంపైనే మా ఫోకస్: తొలి ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ