IND vs SA: విమర్శలతో మాకు పనిలేదు.. మా మధ్య బలమైన బంధం ఉంది.. జట్టు విజయంపైనే మా ఫోకస్: తొలి ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ
India Vs South Africa 2021: దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తొలగించి, రోహిత్ శర్మను బీసీసీఐ నియమించింది. అయితే దీనిపై చాలా వివాదాలు నెలకొన్నాయి.
India Vs South Africa 2021: భారత క్రికెట్ జట్టు వన్డే, టీ20 నాయకత్వంలో మార్పు వచ్చింది. విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ పరిమిత ఓవర్లలో జట్టుకు కొత్త కెప్టెన్‌గా మారాడు. ప్రస్తుతం రోహిత్ సారథ్యంలో భారత జట్టు వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో 3 వన్డేల సిరీస్ ఆడనుంది. కోహ్లి నుంచి వన్డే కెప్టెన్సీ లాక్కొని రోహిత్‌కి ఇవ్వడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వివాదాల మధ్య, కొత్త కెప్టెన్ రోహిత్ తన మొదటి ఇంటర్వ్యూ ఇచ్చాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో తన లక్ష్యం ఏమిటో, ఈ లక్ష్యాలను ఎలా సాధిస్తాడో ఇందులో పేర్కొన్నాడు. అదే సమయంలో, కెప్టెన్సీపై జరుగుతోన్న వివాదాలపై చర్చించాడు.
డిసెంబర్ 8న టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ నియమితుడయ్యాడు. కెప్టెన్ అయిన తర్వాత బీసీసీఐకి ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ తన సవాళ్లు, లక్ష్యాల గురించి మాట్లాడాడు. కెప్టెన్సీపై వివాదానికి సంబంధించి, రోహిత్ సంజ్ఞలతో మాట్లాడుతూ, “భారతదేశం కోసం క్రికెట్ ఆడుతున్నప్పుడు, మీపై ఎప్పుడూ చాలా ఒత్తిడి ఉంటుంది. ప్రజలు ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతుంటారు. కొందరు పాజిటివ్‌గా మాట్లాడతారు. ఇంకొందరు నెగటివ్‌గా కామెంట్లు చేస్తుంటారు. కానీ, నాకు కెప్టెన్‌గా కాకుండా క్రికెటర్‌గానే నా పనిపై దృష్టి పెడుతుంటాను. కామెంట్లు చేసే వారిని మనం నియంత్రించలేం” అంటూ చెప్పుకొచ్చాడు.
బయట ఏం జరిగినా.. గత ఏడాదిన్నర కాలంగా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడుతున్న రోహిత్.. ఈ విషయం ఆటగాళ్లందరికీ తెలుసునని పేర్కొన్నాడు. రోహిత్ మాట్లాడుతూ, “మేం హై ప్రొఫైల్ టోర్నమెంట్‌లు ఆడుతుంటాం. ఇలాంటి విషయాలు జరుగుతుంటాయి. జట్టులోని ప్రతీ ఆటగాడు అర్థం చేసుకుంటాడు. మా పనిని అర్థం చేసుకోవడం, జట్టు కోసం మ్యాచ్‌లను గెలవడం మాకు ముఖ్యం. మాకు తెలిసిన గేమ్‌ను ఆడుతుంటాం. బయట ఏం జరిగినా పట్టించుకోం.”
ఆటగాళ్ల మధ్య బలమైన సంబంధం.. జట్టులోని ఆటగాళ్లు ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారనేది చాలా ముఖ్యమని భారత కెప్టెన్ అన్నాడు. ఎందుకంటే ఇది జట్టులో మంచి సంబంధాన్ని ఏర్పరుస్తుంది. కోచ్ ద్రవిడ్ దీనికి సహాయం చేస్తారు. రోహిత్ మాట్లాడుతూ, “ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నామన్నదే మాకు ముఖ్యం. ఫలానా ఆటగాళ్ల గురించి నేను ఏమనుకుంటున్నానో అది కూడా చాలా ముఖ్యం. మేం ఆటగాళ్ల మధ్య బలమైన బంధాన్ని నిర్మించాలనుకుంటున్నాం. ఈ విధంగా మేం ఆ సంబంధాన్ని నిర్మించగలుగుతాం. ఇందులో రాహుల్ భాయ్ కూడా మాకు సహాయం చేస్తారు’ అని తెలిపాడు.
కోహ్లీ తొలగింపుపై వివాదం.. టీ20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్నప్పటికీ వన్డే, టెస్టు జట్లకు కెప్టెన్‌గా కొనసాగుతానని పేర్కొన్నాడు. అయితే డిసెంబర్ 8న దక్షిణాఫ్రికా టూర్‌కు టెస్టు జట్టును ఎంపిక చేయడంతో బీసీసీఐ వన్డే కెప్టెన్సీని కూడా కోహ్లీ నుంచి లాక్కొని రోహిత్‌ని కెప్టెన్‌గా చేసింది. అప్పటి నుంచి బీసీసీఐపై కోహ్లీ అభిమానుల ఆగ్రహం కొనసాగుతోంది. అలాగే, కోహ్లిని తొలగించడానికి గల కారణాన్ని పత్రికా ప్రకటనలో పేర్కొనకపోవడంపై పలువురు క్రికెట్ నిపుణులు కూడా ప్రశ్నలు సంధించారు.
?️?️ “The pressure will always be there. As a cricketer, it is important to focus on my job.”
SPECIAL – @ImRo45‘s first interview after being named #TeamIndia’s white-ball captain coming up on https://t.co/Z3MPyesSeZ. ?️
Stay tuned for this feature ⌛ pic.twitter.com/CPB0ITOBrv
— BCCI (@BCCI) December 12, 2021
Rajinikanth Birthday: తలైవాకు తనదైన స్టైల్‌లో బర్త్ డే విషెస్ చెప్పిన భజ్జీ.. ఏం చేశాడంటే..