AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth Birthday: తలైవాకు తనదైన స్టైల్‌లో బర్త్‌ డే విషెస్‌ చెప్పిన భజ్జీ.. ఏం చేశాడంటే..

తమిళ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగుండే ఆయనకు కేవలం మన దేశంలోనే కాదు..జపాన్‌ లాంటి విదేశాల్లోనూ పెద్ద ఎత్తున అభిమానులున్నారు

Rajinikanth Birthday: తలైవాకు తనదైన స్టైల్‌లో బర్త్‌ డే విషెస్‌ చెప్పిన భజ్జీ.. ఏం చేశాడంటే..
Basha Shek
|

Updated on: Dec 12, 2021 | 5:42 PM

Share

తమిళ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగుండే ఆయనకు కేవలం మన దేశంలోనే కాదు..జపాన్‌ లాంటి విదేశాల్లోనూ పెద్ద ఎత్తున అభిమానులున్నారు. అలాంటి సూపర్‌ స్టార్‌ నేడు( డిసెంబర్‌ 12)న పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా తలైవా అభిమానులు కొందరు చెన్నైలోని ఆయన నివాసానికి వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపగా.. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా సూపర్‌ స్టార్‌కు బర్త్‌ డే విషెస్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ వినూత్న శైలిలో రజనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఆయన టాటూను తన ఛాతీపై వేసుకుని మరీ స్పెషల్‌గా బర్త్‌ డే విషెస్‌ తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఈ సందర్భంగా తన ఛాతీపై ఉన్న రజనీ ట్యాటూను చూపిస్తూ ..’సూపర్ స్టార్‌ నా మనసులో ఉన్నారు. మీరు 80వ దశకంలో ‘బిల్లా’గా.. 90లలో ‘బాషా’ గా.. ఇటీవల ‘అన్నాత్తే (పెద్దన్న)’ గా అలరించారు. సూపర్ స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ తమిళ్‌లో రాసుకొచ్చాడు భజ్జీ. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫొటోపై లైకుల, షేర్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా తలైవా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. కాగా మైదానంలో బంతితో మాయ చేసిన హర్భజన్‌ ఇటీవల వెండితెరపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తో కలిసి ‘ఫ్రెండ్ షిప్‌’ అనే చిత్రంలో నటించాడు. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదలైంది. ఇక ఐపీఎల్‌లో ప్రస్తుతం కోల్‌కతాకు నైట్‌ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న భజ్జీ గతంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు తరఫున ఆడిన సంగతి తెలిసిందే.

Also Read:

RRR in OTT: ఆర్ఆర్ఆర్ మూవీ భారీ ధరకు డిజిటల్ రైట్స్ .. ఓటిటిలో ప్రసారమయ్యేది ఎప్పుడంటే..

Pushpa MASSive Pre Release Party: ఘనంగా ‘పుష్ప’ ప్రీరిలీజ్ ఈవెంట్.. భారీగా తరలి వచ్చిన అభిమానులు..

Viral video: ప్రభాస్‌ పాటకు టాంజానియా అన్నాచెల్లెళ్ల లిప్‌ సింక్‌.. కత్రినా పాటకు కూడా.. వైరల్‌గా మారిన వీడియోలు..