Viral video: ప్రభాస్‌ పాటకు టాంజానియా అన్నాచెల్లెళ్ల లిప్‌ సింక్‌.. కత్రినా పాటకు కూడా.. వైరల్‌గా మారిన వీడియోలు..

ఇటీవల 'షేర్షా' సినిమాలోని ‘రాతన్‌ లంబియాన్‌’ పాటకు అద్భుతంగా లిప్‌ సింక్‌చేసి పలువురి మన్ననలు అందుకున్నారు టాంజానియాకు చెందిన అన్నాచెల్లెళ్లు కిలీపాల్‌, నీమాపాల్‌. ఆ పాటలోని లిరిక్స్‌కు తగ్గట్టుగా హావభావాలతో మెప్పించారు..

Viral video: ప్రభాస్‌ పాటకు టాంజానియా అన్నాచెల్లెళ్ల లిప్‌ సింక్‌.. కత్రినా పాటకు కూడా.. వైరల్‌గా మారిన వీడియోలు..
Follow us

|

Updated on: Dec 12, 2021 | 5:11 PM

ఇటీవల ‘షేర్షా’ సినిమాలోని ‘రాతన్‌ లంబియాన్‌’ పాటకు అద్భుతంగా లిప్‌ సింక్‌చేసి పలువురి మన్ననలు అందుకున్నారు టాంజానియాకు చెందిన అన్నాచెల్లెళ్లు కిలీపాల్‌, నీమాపాల్‌. ఆ పాటలోని లిరిక్స్‌కు తగ్గట్టుగా హావభావాలతో మెప్పించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అక్షయ్‌ కుమార్‌, సింగర్‌ జుబిన్‌ నౌటియాల్‌ లాంటి సెలబ్రిటీలు కూడా ఈ అన్నాచెల్లెళ్ల ప్రతిభకు ముగ్ధులయ్యారు. నెటిజన్లు కూడా ‘సంగీతానికి సరిహద్దుల్లేవని వీరిద్దరూ మరోసారి నిరూపించారు’ అంటూ కిలీపాల్‌- నీమాపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా వీరు మరికొన్ని పాటలను రీక్రియేట్‌ చేశారు. అందులో ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ కూడా ఉంది.

‘రాధేశ్యామ్‌’ లో అర్జిత్‌ సింగ్‌ పాడిన ‘ఆషికీ ఆగయీ’ పాట సంగీతాభిమానులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ పాటకు లిప్‌సింక్‌ చేశారు కిలీపాల్‌- నీమాపాల్‌. సాంగ్‌లోని లిరిక్స్‌కు తగ్గట్టుగా అద్భుతమైన హావభావాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

View this post on Instagram

A post shared by Kili Paul (@kili_paul)

అదేవిధంగా ‘సూర్యవంశీ’ సినిమాలో ‘టిప్‌ టిప్‌ బర్సా పానీ’ పాటను రీక్రియేట్‌ చేశారు. ఇందులో కత్రినా వేసిన స్టెప్పులను సూపర్బ్‌గా అనుకరించి మెప్పించారు.

View this post on Instagram

A post shared by Kili Paul (@kili_paul)

గతంలో అక్షయ్‌ కుమార్‌, ఇలియానా జంటగా నటించిన ‘రుస్తుమ్‌’ సినిమాలోని ‘తేరే సంగ్‌ యారా’ పాటతో పాటు మరికొన్ని పాటలను అనుకరిస్తూ చేసిన వీరి వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అన్నాచెల్లెళ్ల క్రియేటివిటీపై బాలీవుడ్‌ ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Kili Paul (@kili_paul)

ఆఫ్రికా ఖండంలో టిక్‌టాక్‌ సెన్సేషన్‌గా ఎంతో క్రేజ్‌ సొంతం చేసుకున్నారు కిలీపాల్‌- నీమాపాల్‌. ముఖ్యంగా కిలీపాల్‌కు చేసే టిక్‌టాక్‌ వీడియోలకు లక్షల్లో లైకులు వస్తుంటాయి. అతనిని టిక్‌టాక్‌లో 1.5 మిలియన్ల మంది అనుసరిస్తుండడం విశేషం. సోదరి నీమాకు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగానే ఫాలోవర్లు ఉన్నారు. వీరు గత కొంతకాలంగా తమ లిప్ సింక్స్‌తో బాలీవుడ్ సాంగ్స్ రీక్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీరి లిప్ సింక్ వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి.

View this post on Instagram

A post shared by Kili Paul (@kili_paul)

Also Read: