AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR in OTT: ఆర్ఆర్ఆర్ మూవీ భారీ ధరకు డిజిటల్ రైట్స్ .. ఓటిటిలో ప్రసారమయ్యేది ఎప్పుడంటే..

RRR in OTT: దక్షిణాదిలో మెగా మల్టీస్టారర్ మూవీ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ..(రౌద్రం రణం రుథిరం)..సంక్రాంతి కానుకగా ప్రపంచ..

RRR in OTT: ఆర్ఆర్ఆర్ మూవీ భారీ ధరకు డిజిటల్ రైట్స్ .. ఓటిటిలో ప్రసారమయ్యేది ఎప్పుడంటే..
Rrr In Ott
Surya Kala
|

Updated on: Dec 12, 2021 | 5:51 PM

Share

RRR in OTT: దక్షిణాదిలో మెగా మల్టీస్టారర్ మూవీ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ..(రౌద్రం రణం రుథిరం)..సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్నది. పాన్ ఇండియా మూవీగా తెరెక్కిన ఆర్ఆర్ఆర్  డిజిటల్ లో ఎప్పుడు రిలీజ్ కానుందో మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.

కరోనా వైరస్ విజృంభణ తర్వాత వెలుగులోకి వచ్చి.. సినిమా థియేటర్స్ మూతబడ్డాయి. దీంతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఓటిటి. సూర్య వంటి స్టార్ హీరోలు సైతం డైరెక్ట్ గా ఓటిటిలోనే సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇక థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు సైతం 50 రోజుల అనంతరం డిజిటల్ లో సినిమాలు ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ కూడా ఓటిటిలో 50రోజులకే రిలీజ్ అవుతుందని సినీ అభిమానులు అనుకున్నారు. అయితే ఈ సినిమా 90 రోజుల అనంతరం ఓటిటిలో ప్రసారం కానున్నది.

ఆర్ఆర్ఆర్ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి సంస్థ ZEE5 భారీ ధరకు దక్కించుకుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి చిత్ర యూనిట్ ముంబై లో జరిగిన ట్రైలర్ లాంచ్ సమయంలో క్లారిటీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ థియేటర్లలో విడుదలైన  90 రోజుల తర్వాత స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫారమ్‌లలో విడుదల చేయనున్నట్లు మూవీ నిర్మాతలు ప్రకటించారు.

పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ లో .. తారక్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్‌  అల్లూరి సీతారామ రాజు పాత్రలు నటిస్తున్నారు.  ఈ సినిమా టోటల్ రన్ టైమ్‌ మూడు గంటల ఆరు నిమిషాలు వచ్చిందని అంటున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు.  ఎం.ఎం. కీరవాణి సంగీతం , సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ అన్ని భాషల్లోనూ ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది.

Also Read:  వెయిటర్‌ పంట పండింది.. ఫుడ్‌ సర్వ్‌ చేసి ఏకంగా 7 లక్షల టిప్‌ అందుకుంది..

Follow Us
ఫ్రిజ్ లేకపోయినా పచ్చిమిర్చి నెలల తరబడి తాజాగా ఉండాలా?
ఫ్రిజ్ లేకపోయినా పచ్చిమిర్చి నెలల తరబడి తాజాగా ఉండాలా?
ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈమెనే..
ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈమెనే..
ఆర్జీవీ లేకపోతే నేను లేను.. కిచ్చా సుదీప్..
ఆర్జీవీ లేకపోతే నేను లేను.. కిచ్చా సుదీప్..
జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు వర్షం
జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు వర్షం
రాహువుతో జాగ్రత్త.. ఆ రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు..!
రాహువుతో జాగ్రత్త.. ఆ రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు..!
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా
టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా