Waitress Gets Rs 7 Lakh Tip: వెయిటర్ పంట పండింది.. ఫుడ్ సర్వ్ చేసి ఏకంగా 7 లక్షల టిప్ అందుకుంది..
Waitress Gets Rs 7 Lakh Tip: పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు ఫుడ్ సర్వ్ చేసినవారికి టిప్ ఇస్తుంటారు. చాలామంది చాలా తక్కువ మొత్తం టిప్‌గా ఇస్తారు..
Waitress Gets Rs 7 Lakh Tip: పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు ఫుడ్ సర్వ్ చేసినవారికి టిప్ ఇస్తుంటారు. చాలామంది చాలా తక్కువ మొత్తం టిప్‌గా ఇస్తారు. అతి కొద్దిమంది మాత్రమే వెయ్యి రూపాయల వరకు టిప్ ఇస్తారు. కానీ ఇక్కడ ఒక మహిళ తనకు ఫుడ్ సర్వ్ చేసిన వెయిటర్‌కి ఏకంగా లక్షల్లో టిప్ ఇచ్చింది… ఎందుకు.. ఎలా అనుకుంటున్నారా.. అదే ఇప్పడు తెలుసుకోబోతున్నాం…
విలియమ్స్ అనే మహిళ ఒక రోజు రెస్టారెంట్‌కి వెళ్లింది. అక్కడ ఒక వెయిటర్ విలియమ్స్‌కి ఫుడ్ సర్వ్ చేసింది. అయితే విలియమ్స్‌కి సదరు వెయిటర్ పనితీరు బాగా నచ్చింది. దాంతో ఆమె తను తిన్నఫుడ్‌కి గాను 30 డాలర్లు అంటే 2,271 రూపాయలు చెల్లించింది. వెయిటర్‌కు టిప్పుగా $40 డాలర్లు అంటే 3,082 రూపాయలలు టిప్పు ఇస్తుంది. అంతే వెయిటర్ సదరు కస్టమర్ ఉదారతకు ఉప్పొంగిపోతుంది. అంతేకాదు వెయిటర్ తన పాపను డే కేర్‌లో ఉంచి అక్కడ జాబ్ చేస్తున్నానని, పాపకోసం ఉద్యోగం మానేయాలనుకుంటున్నట్లు ఆ కస్ట్‌మర్‌కి చెప్పింది. దాంతో విలయమ్స్ సదరు వెయిటర్ పేరు మీద క్యాష్ యాప్‌ని ఓపెన్ చేసి, ఆమె గురించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి ఎవరికి వీలైనంత వారు సాయం చేయండి అంటూ కోరుతుంది. ఈ విషయాలు ఏవీ సదరు వెయిటర్‌కి తెలియవు. అయితే ఈ వెయిటర్‌కి అదేపనిగా డబ్బులు అకౌంట్‌లో పడుతుండటంతో అనుమానం వచ్చి చెక్‌చేస్తుంది. అంతే క్యాష్ యాప్ ద్వారా ఆమె అకౌంట్‌లో అపరిచితుల నుంచి దాదాపు 7లక్షలు టిప్పు వస్తుంది. దాంతో వెయిటర్ ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. తనకు డబ్బులు పంపిన వారందరికి, తనకు ఇంతగా సాయం చేసిన కస్టమర్ విలియమ్స్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతుంది.
Also Read: సూపర్ స్టార్ మహేష్ బాబు పోష్ ఏరియాలో ఖరీదైన ప్లాట్ కొనుగోలు.. ఖరీదు తెలిస్తే షాక్..