Viral: రెస్టారెంట్‌లో వెయిటర్ సర్వీస్‌కు కస్టమర్ ఫిదా.. ఎంత టిప్ ఇచ్చిందో తెలిస్తే షాకే
రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు ఫుడ్ సర్వ్ చేసినవారికి... కస్టమర్స్ టిప్ ఇస్తుంటారు. అయితే ఈ టిప్ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది.

రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు ఫుడ్ సర్వ్ చేసినవారికి… కస్టమర్స్ టిప్ ఇస్తుంటారు. అయితే ఈ టిప్ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. వెయ్యి రూపాయల దాటి టిప్ ఇచ్చేవారిని వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. కానీ ఇక్కడ ఒక మహిళ తనకు ఫుడ్ సర్వ్ చేసిన విమెన్ వెయిటర్‌కి ఏకంగా 7 లక్షల వరకు టిప్ ఇచ్చింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.
విలియమ్స్ అనే మహిళ ఒక రోజు రెస్టారెంట్‌కి వెళ్లింది. అక్కడ ఒక విమెన్ వెయిటర్ విలియమ్స్‌కి ఫుడ్ సర్వ్ చేసింది. అయితే విలియమ్స్‌కి సదరు వెయిటర్ సర్వీస్ బాగా నచ్చింది. దాంతో ఆమె తను తిన్నఫుడ్‌కి గాను 30 డాలర్లు అంటే 2,271 రూపాయలు చెల్లించింది. వెయిటర్‌కు టిప్పుగా $40 డాలర్లు అంటే 3,082 రూపాయలలు టిప్పు ఇచ్చింది. అంటే ఆమె తిన్న ఫుడ్ రేట్ కంటే.. టిప్పే ఎక్కువ. అంతే వెయిటర్.. సదరు కస్టమర్ దాతృత్వానికి ఉప్పొంగిపోతుంది. చేతులెత్తి దండం పెట్టింది. అంతేకాదు తన పాపను డే కేర్‌లో ఉంచి అక్కడ జాబ్ చేస్తున్నానని, పాపను దగ్గరుండి చూసుకోవడానికి ఉద్యోగం మానేయాలనుకుంటున్నట్లు ఆ కస్ట్‌మర్‌కి చెప్పింది. దాంతో సదరు వెయిటర్ పేరు మీద క్యాష్ యాప్‌ని ఓపెన్ చేసిన ఆ కస్టమర్… ఆమె గురించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి ఎవరికి వీలైనంత వారు సాయం చేయండి అంటూ అభ్యర్థించింది. ఈ విషయాలు ఏవీ సదరు వెయిటర్‌కి తెలియవు. అయితే ఈ వెయిటర్‌కి డబ్బులు అకౌంట్‌లో పడుతుండటంతో అనుమానం వచ్చి చెక్ చేసింది. క్యాష్ యాప్ ద్వారా ఆమె అకౌంట్‌లో అపరిచితుల నుంచి దాదాపు 7 లక్షల వరకు డబ్బు వచ్చి చేరింది. దాంతో వెయిటర్ ఫుల్ హ్యాపీ అయ్యింది. తనకు డబ్బులు పంపిన అపరిచితులకు, ఇంతలా తన గురించి ఆలోచించిన కస్టమర్‌కు థ్యాంక్స్ చెబుతుంది.
Also Read: 100 కోట్ల ‘అఖండ’.. కలెక్షన్లతో సింహగర్జన చేస్తోన్న బాలయ్య.. షేకయిన బాక్సాఫీస్