Akhanda: 100 కోట్ల ‘అఖండ’.. కలెక్షన్లతో సింహగర్జన చేస్తోన్న బాలయ్య.. షేకయిన బాక్సాఫీస్

యస్.. అనుకున్నదే జరిగింది. సిల్వర్ స్క్రీన్ షేకయ్యింది. బాక్సాఫీస్ పేలిపోయింది. అఖండ దెబ్బకు థియేటర్లు దద్దరిల్లాయి.

Akhanda: 100 కోట్ల 'అఖండ'.. కలెక్షన్లతో సింహగర్జన చేస్తోన్న బాలయ్య.. షేకయిన బాక్సాఫీస్
Akhanda
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 12, 2021 | 12:48 PM

యస్.. అనుకున్నదే జరిగింది. సిల్వర్ స్క్రీన్ షేకయ్యింది. బాక్సాఫీస్ పేలిపోయింది. అఖండ దెబ్బకు థియేటర్లు దద్దరిల్లాయి. చాలాకాలం తర్వాత థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టించాడు బాలయ్య. అఘోరాగా కలెక్షన్ల సునామీ సృష్టించాడు. కెరీర్‌లో తొలిసారి 100 కోట్ల మార్క్‌ను అందుకున్నాడు. బోయపాటి ఇచ్చిన మాస్ స్ట్రోక్‌కు.. ఒక్క బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. అందుకే అఖండ విజయాన్ని కట్టబెట్టారు.

అఖండ సినిమాకు గాను  10 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇప్పుడు పరిశీలిద్దాం. నైజాంలో రూ. 16.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 12.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.10 కోట్లు, గుంటూరులో రూ. 3.96 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.39 కోట్లు, కృష్ణాలో రూ. 2.99 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.80 కోట్లు, నెల్లూరులో రూ. 2.15 కోట్లు వచ్చాయి. ఇక రెండు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 49.34 కోట్లు షేర్ వచ్చినట్లు ట్రేడ్ నిపుణుల నుంచి వచ్చిన సమాచారం. కర్నాటక, దేశంలోని మిగతా రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో కలిసి 10 రోజుల్లో మొత్తంగా రూ. 9.35 కోట్లు రాబట్టింది. వీటన్నింటిని కలుపుకుంటే రూ. 58.74 కోట్లు షేర్ రాగా…. రూ. 100 కోట్లు గ్రాస్‌ను దాటినట్లు చెబుతున్నారు. రెమ్యూనరేషన్స్ కలుపుకుని ఈ మూవీకి రూ. 53 కోట్లు వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే 8 రోజుల్లోనే టార్గెట్ కంప్లీట్ చేసి.. బ్రేక్ ఈవెన్‌లోకి దూసుకెళ్లింది అఖండ. ఇక ఏపీలో బెనిఫిట్ షోలపై, టికెట్ రేట్లపై నియంత్రణ ఉంది కానీ.. లేదంటే కథ వేరేలా ఉండేది అన్నది బాలయ్య ఫ్యాన్స్ వెర్షన్. మొత్తం మీద బాలయ్య ‘అఖండ’తో సింహనాదం చేస్తున్నారు. మొత్తంగా సినీ పరిశ్రమకు ‘అఖండ’ ఊపిరి పోసిందని చెబుతున్నారు ఇండస్ట్రీ ప్రముఖులు.

Also Read: మంచు విష్ణు సంచలన నిర్ణయం.. ప్రకాష్‌ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు ఆమోదం

ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు.. విజయనగరం జిల్లాలో నిర్ధారణ