AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Omicron Case: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు.. విజయనగరం జిల్లాలో నిర్ధారణ

 ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది.

AP Omicron Case: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు.. విజయనగరం జిల్లాలో నిర్ధారణ
ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు
Ram Naramaneni
|

Updated on: Dec 12, 2021 | 12:25 PM

Share

ఏపీలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఎక్కడో మహారాష్ట్ర, గుజరాత్‌లో కాదు. తాజాగా ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ధృవీకరించంది. విజయనగరంలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు తెలిపింది. గత నెల 27న ఐర్లాండ్‌ నుంచి ముంబై వచ్చిన 34 ఏళ్ల ప్రయాణికుడికి ముంబైలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా.. కోవిడ్‌ నెగెటివ్‌గా వచ్చింది. దీంతో  ముంబై నుంచి సదరు ప్రయాణికుడు విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలానికి  వెళ్లాడు. అక్కడ మరోసారి టెస్ట్ చేయగా ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. దీంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. అధికారులు అలెర్టయి… బాధితుడిని ఐసోలేషన్‌లో ఉంచి.. చికిత్స అందిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించింది. విదేశాల నుంచి వచ్చిన 15 మంది శాంపిల్స్ జీనోమ్ టెస్టింగ్ కోసం పంపితే.. పది శాంపిళ్లకు నివేదికలు అందాయని.. వాటిలో ఒక కేసు మాత్రమే ఒమిక్రాన్‌గా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Also Read: ఈ ఫోటోలోని చిన్నారి.. హీరోయిన్‌గా టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.. ఎవరో గుర్తించారా..?

Follow Us
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి