Lance Naik Sai Teja: నాన్నకు ప్రేమతో.. అమరవీరుడు లాన్స్ నాయక్ సాయితేజ కటౌట్‌ను ముద్దాడిన తనయుడు..
ఇంటి ముందు ఒకటే హడావుడి.. ఫోటోలు పెట్టి పూలదండలు వేశారు. త్రివర్ణ పతాకాలతో యువత అక్కడి చేకున్నారు. అంతిమ యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరో వైపు..
Lance Naik Sai Teja: మాతృభూమి సేవలో అమరుడైన సైనికుడు.. లాన్స్ నాయక్ సాయితేజ ఇంటి ముందు గత రెండు రోజులుగా జనం బారులు తీరుతున్నారు. అంతిమయాత్ర రోజు ఇసుక వేస్తే రాలనంత జనం చేరుకున్నారు. ఇంటి ముందు ఒకటే హడావుడి.. ఫోటోలు పెట్టి పూలదండలు వేశారు. త్రివర్ణ పతాకాలతో యువత అక్కడి చేకున్నారు. అంతిమ యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరో వైపు ఆర్మీ ఉన్నతాధికారులు సాయి తేజ ఇంటికొచ్చి.. మీ సాయితేజ ఎంత గొప్పవాడో తెలుసా అని చెప్పినప్పుడు ఆ తండ్రి గుండె ఉప్పొంగింది. అంతలోనే సాయి శాశ్వత నిద్రలోకి జారుకున్నాడని తెలిసి కన్నీరు పెట్టుకోవాలో.. దేశ సేవలో అమరుడయ్యాడని.. ఇలాంటి పరిస్థితి వారి కుటుంబంలో నెలకొంది.
ఇక అక్కడి వస్తున్న జన్నాన్ని చూసి తెలియని అమాయకత్వంలో చూస్తుండిపోయాడు సాయితేజ ఐదేళ్ళ కుమారుడు మోక్షజ్ఞ. అయితే తమ ఇంటి ముందు ఏర్పాటు చేసిన తండ్రి భారీ కటౌట్‌ను అలానే చూస్తుండిపోయాడు. నాన్న ఫోటోలు పెట్టి పూలదండలు చూసిన సాయితేజ కుమారుడు.. నెమ్మదిగా తన తండ్రి ఫోటోని ముద్దాడాడు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానిక జనం.. భారత్ మాతాకి జై..! అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
జాతీయ జెండాలు చేతపట్టుకుని.. సాయితేజ ఫోటో ఉన్న టిషర్టులు ధరించి.. అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. సాయితేజ సాహసాలను తలుచుకొని ఆ గడ్డ గర్వంగా ఫీల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి: MLC Elections: నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే…!
PM Modi Tribute: ఢిల్లీ చేరుకున్న రావత్ సహా 13 మంది పార్థివదేహాలు.. నివాళులర్పించిన ప్రధాని మోడీ