Tollywood Heroine: ఈ ఫోటోలోని చిన్నారి.. హీరోయిన్‌గా టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.. ఎవరో గుర్తించారా..?

నెట్టింట స్టార్స్‌కు సంబంధించిన ఫోటోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. కొందరివి చిన్నప్పటి ఫోటోలు చూసి.. వారు ఇప్పుడు ఫలానా స్టార్ అంటే అస్సలు నమ్మలేం.

Tollywood Heroine: ఈ ఫోటోలోని చిన్నారి.. హీరోయిన్‌గా టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.. ఎవరో గుర్తించారా..?
Tollywood
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 11, 2021 | 9:46 PM

నెట్టింట స్టార్స్‌కు సంబంధించిన ఫోటోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. కొందరివి చిన్నప్పటి ఫోటోలు చూసి.. వారు ఇప్పుడు ఫలానా స్టార్ అంటే అస్సలు నమ్మలేం. ప్రజంట్ డిజిటల్ యుగంలో ఇలాంటి ఫోటోలు రోజూ ట్రెండ్  అవుతూనే ఉన్నాయి. తాజాగా బాలనటిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి.. హీరోయిన్‌గా తెలుగు, తమిళ పరిశ్రమల్లో టాప్ స్టార్స్‌తో ఆడిపాడిన ఓ నటి చిన్నప్పటి ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ నటి ఎవరో కాదండోయ్.. రాశి. ప్రస్తుతం రాశి అడపాదడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తున్నారు. కెరీర్ తొలినాళ్లలో గోకులంలో సీత అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి జోడీగా నటించింది రాశి.  పెళ్లి పందిరి, మనసిచ్చిచూడు, శుభాకాంక్షలు, స్వప్నలోకం, ప్రేయసి రావే సినిమాలతో హీరోయిన్‌గా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. రాశిని పెళ్లి చేసుకునేందుకు ఎంతోమంది శ్రీమంతులు ముందుకొచ్చినా.. ఆమె మాత్రం ప్రేమించిన వాడి ముందు కోట్లు ఎక్కువ కాదనుకుని శ్రీముని అనే అసిస్టెంట్ డైరెక్టర్‌ని పెళ్లాడింది. ఒకప్పుడు హీరోయిన్‌గానే మెప్పించడమే కాకుండా స్పెషల్ సాంగ్స్‌లో కూడా నర్తించిన ఈ నటి.. ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. సెకండ్ ఇన్సింగ్స్‌లో  కళ్యాణ వైభోగమే, పడేశావే, ఆకతాయి వంటి చిత్రాలు చేసినా పెద్దగా క్లిక్ అవ్వలేదు. దీంతో ప్రజంట్ ఆమె ‘జానకి కలగనలేదు’ సీరియల్ లో అత్త పాత్ర పోషిస్తున్నారు. అంతకుముందు గిరిజా కళ్యాణం సీరియల్‌లో కూడా రాశి నటించారు.

కాగా రాశి చిన్ననాటి ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటో ఉంది రాశి అని చాలామంది నమ్మలేకపోతున్నారు. ఆమె అని తెలియగానే.. అరె, ఔనా గుర్తుపట్టలేకపోయాం అని కామెంట్లు పెడుతున్నారు.

Raasi

Also Read:  జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాల్లోని మహిళల రుణాలన్నీ మాఫీ

ఆశ్చర్యం.. ఏపీలో పెరిగిన మునక్కాడల ధర… కేజీ ఏకంగా రూ.600