ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారా.. మోత మోగనున్న ఛార్జీలు.. ఫైన్‌లు

Atm Cash Withdrawal: కొత్త సంవత్సరం నుంచి దేశంలో బ్యాంకింగ్ సేవలు ఖరీదైనవి కానున్నాయి. పరిమితి తర్వాత ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా

ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారా.. మోత మోగనున్న ఛార్జీలు.. ఫైన్‌లు
Atm
Follow us
uppula Raju

|

Updated on: Dec 13, 2021 | 2:56 PM

Atm Cash Withdrawal: కొత్త సంవత్సరం నుంచి దేశంలో బ్యాంకింగ్ సేవలు ఖరీదైనవి కానున్నాయి. పరిమితి తర్వాత ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేస్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 1 నుంచి దేశంలోని అన్ని బ్యాంకులు ఏటీఎం ఛార్జీలను 5 శాతం పెంచాలని నిర్ణయించాయి. జనవరి 1 నుంచి నెల పరిమితిని దాటి ATM నుంచి నగదు తీసుకుంటే ప్రతిసారీ 21 రూపాయలతో పాటు GST చెల్లించాలి. ఇప్పటి వరకు రూ.20గా ఉన్న ఈ మొత్తాన్ని రూ.21కి పెంచారు. కానీ 18% జీఎస్టీని జోడిస్తే అదనంగా రూ.3.78 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా, ప్రతి విత్‌ డ్రా పై దాదాపు రూ. 25 రుసుము చెల్లించవలసి ఉంటుంది.

మీరు ప్రతి నెలా పొందే ఉచిత ATM లావాదేవీలు అయిపోయిన తర్వాత మాత్రమే ఈ ఛార్జీలు వసూలు చేస్తారు. ప్రస్తుతం, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రతి నెలా మీ బ్యాంక్ ATM నుంచి 5 ఉచిత లావాదేవీలు, ఇతర బ్యాంకు ATM నుంచి 3 సార్లు తీయవచ్చు. నాన్-మెట్రో నగరాల్లో మీరు మీ సొంత ATMలు, ఇతర బ్యాంకుల నుంచి 5-5 ఉచిత లావాదేవీలు చేయవచ్చు. దీని తర్వాత మీరు లావాదేవీ చేయడానికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఎంత వసూలు చేస్తారో తెలుసుకోండి జనవరి 1 నుంచి ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసేటప్పుడు మీ సొంత ఏటీఎం లేదా మరే ఇతర బ్యాంకు ఏటీఎం నుంచి ఎన్నిసార్లు డబ్బులు డ్రా చేశారో గుర్తుంచుకోవాలి. ATM రుసుము కాకుండా బ్యాంకులు మీకు వసూలు చేసే అనేక ఇతర ఛార్జీలు కూడా ఉంటాయి. నగదు లావాదేవీలు, మినిమమ్ బ్యాలెన్స్, కొత్త ATM కార్డులు, చెక్ బుక్‌లను జారీ చేయడానికి ఛార్జీలు మొదలైనవి ఉంటాయి. మీరు సేవింగ్స్ అకౌంట్ హోల్డర్ అయితే మీ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోకపోతే దానికి బదులుగా బ్యాంక్ రుసుము వసూలు చేస్తుంది. ఈ రుసుము అకస్మాత్తుగా తీసివేస్తారు. మీరు దానిని గమనించకపోవచ్చు. పాస్‌బుక్‌ను అప్‌డేట్ చేసినప్పుడు మీ ఖాతా నుంచి డబ్బు తీసినట్లు తెలుస్తుంది.

బ్యాంకులు ఎంత సంపాదించాయి కొన్ని ప్రైవేట్ బ్యాంకుల మినిమమ్‌ బ్యాలెన్స్‌ 1000 నుంచి 10,000 వరకు ఉంటుంది. ఈ మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకుంటే నెలకు రూ.150తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. మీ ఖాతా జీరో బ్యాలెన్స్ ఖాతా లేదా సాలరీ అకౌంట్‌, లేదా జన్ ధన్ ఖాతా అయితే మినిమమ్ బ్యాలెన్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందులో డబ్బు కట్‌ చేయరాదు. 2017-18లోనే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు ఖాతాదారుల నుంచి బ్యాంకులు రూ.5,000 కోట్లు జరిమానాగా వసూలు చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

Varanasi: పవిత్ర నగరం వారణాసిలో ఈ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తే జన్మధన్యం..

ధోని నగరంలో చుక్కలు చూపించిన మరో వికెట్ కీపర్.. 8 సిక్సర్లు 11 ఫోర్లతో తుఫాన్‌ సెంచరీ..

ప్రతిరోజు రూ.417 పొదుపు చేయండి.. కోటి రూపాయలు సంపాదించండి..