Year Ender 2021: ఈ ఏడాది విడుదలైన టాప్‌-9 ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌.. ఫీచర్స్‌, ధర ఇతర వివరాలు

Top Electric Scooters 2021: ఈ ఏడాది ముగియబోతోంది. ఈ ఏడాది ఆటోమొబైల్‌ రంగంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆటో మొబైల్ రంగంలో 2021 సంవత్సరం కలిసి వచ్చిందనే..

Year Ender 2021: ఈ ఏడాది విడుదలైన టాప్‌-9 ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌.. ఫీచర్స్‌, ధర ఇతర వివరాలు
Follow us

|

Updated on: Dec 13, 2021 | 4:42 PM

Top Electric Scooters 2021: ఈ ఏడాది ముగియబోతోంది. ఈ ఏడాది ఆటోమొబైల్‌ రంగంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆటో మొబైల్ రంగంలో 2021 సంవత్సరం కలిసి వచ్చిందనే చెప్పాలి. రకరకాల వాహనాలు మార్కెట్లో విడుదలయ్యాయి. ఇక పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను దృష్టిలో ఉంచుకుని వివిధ వాహనతయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపాయి. అందుకు తగినట్లుగానే వేగంగా ఎలక్ట్రిక్‌ వాహనాలను సైతం అందుబాటులోకి తీసుకువచ్చాయి. అంతేకాకుండా 2022లో కూడా మరిన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలు రానున్నాయి. 2021లో విడుదలైన టాప్‌ 9 ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ ఇవే..

Ola ఎలక్ట్రిక్:

Ola ఎలక్ట్రిక్ S1 మరియు S1 Pro: 2021లో ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో సంచనం సృష్టించింది ఓలా. దీని నుంచి రెండు వేరియంట్లలో స్కూటర్స్‌ విడుదలయ్యాయి. ఈ కంపెనీ దేశీయ మార్కెట్లో Ola S1 మరియు S1 ప్రో అనే రెండు స్కూటర్లను విడుదల చేసింది. ఈ రెండు స్కూటర్ల ధరలు వరుసగా రూ. 99,999 మరియు రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్). ఇందులో అత్యాధునిక ఫీచర్స్‌ను అందించింది కంపెనీ. 3.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తి, ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా స్కూటర్‌ బ్యాటరీ 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో దాదాపు 6:30 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇక Ola S1 పూర్తి ఛార్జ్‌ చేస్తే 121 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు. ఇలాగే మరో వేరియంట్‌ ఓలా S1 ప్రో 181 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఈ రెండు స్కూటర్ల టాప్ స్పీడ్ విషయానికి వస్తే, Ola S1 గరిష్టంగా 90 km/h వేగంతో, Ola S1 Pro గరిష్టంగా 115 km/h వేగంతో రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

సింపుల్ వన్:

ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 1.09 లక్షలు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4.8 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీతో జతచేయబడిన 4.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ కలిగి ఉంటుంది. ఈ స్కూటర్‌ బ్యాటరీ ప్యాక్‌ 6 కిలోల బరువు ఉంటుంది. ఇది రిమూవబుల్ బ్యాటరీ. అందుకే సులభంగ ఛార్జ్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ స్కూటర్‌ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 240 కిలోమీటర్ల వరకు ప్రయాణింవచ్చు. ఈ స్కూటర్‌ కేవలం 3.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సింపుల్‌ లూప్‌ సహాయంతో కేవలం 60 సెకన్లలో 2.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఛార్జ్‌ అవుతుంది.

ఏథర్ 450ఎక్స్:

బెంగళూరుకు చెందిన ఏథర్ ఎనర్జీ తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దేశీయ మార్కెట్లో విడుదలైంది. దీని ధర రూ.1.32 లక్షల ఎక్స్-షోరూమ్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపు 116 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 80 కిమీ వరకు ఉంటుంది. ఈ స్కూటర్ కూడా ప్రస్తుతం దేశంలో వినియోగదారులకు కావాల్సిన అన్ని ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. ఈ స్కూటర్ కేవలం 3.3 సెకన్లలో 40 కిమీ వేగాన్ని అందుకునే సామర్థ్య ఉందని కంపెనీ వెల్లడించింది. దీనికి 2.61 కిలోవాట్ బ్యాటరీని ఉపయోగిస్తుంది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్:

దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన ప్రీమియం శ్రేణిలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్‌ ధర రూ. 1.42 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్‌ను అర్బన్, ప్రీమియం అనే రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఇందులో ప్రీమియం వేరియంట్ ధర రూ. 1.44 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూణే)గా ఉంది. స్కూటర్ లో 3 kWh IP 67 లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ను తొలగించడానికి వీలు లేదు. ఎకో మోడ్‌ లో గరిష్టంగా 95 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. స్పోర్ట్ మోడ్‌ లో దీనిని గరిష్టంగా గంటకు 70 కిమీ వేగంతో రైడ్‌ చేయవచ్చు.

టీవీఎస్ ఐక్యూబ్:

టీవీఎస్ మోటార్ తన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూణేలో విడుదల చేసింది. పూణేలో విడుదలైన ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.10 లక్షలు(ఆన్-రోడ్). ఈ స్కూటర్‌లో 4.4 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో పాటు 3 లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. పవర్‌ట్రెయిన్ ఒకే సారి ఛార్జ్‌తో గరిష్టంగా 75 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఈ ఐక్యూబ్ కేవలం 4.2 సెకన్లలో గంటకు 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ స్కూటర్ ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది.

బౌన్స్‌ ఇన్ఫినిటి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌:

బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ బౌన్స్‌ ఇన్ఫినిటి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఇక బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ డెలివరీలు వచ్చే ఏడాది నుంచి ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ స్కూటర్లు రెడ్‌, బ్లాక్‌, వైట్‌, గ్రే కలర్స్‌లో లభిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీతో పాటు స్మార్ట్‌ఫోన్‌ ఆప్షన్ష్‌ కూడా ఇందులో ఉన్నాయి. రివర్సింగ్‌ మోడ్‌ కూడా ఉంది. బౌన్స్‌ ఇన్ఫినిటీ స్కూటర్‌ను ఈకో మోడ్‌తో చార్జ్‌ చేసిన తర్వాత 85 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. స్వాపింగ్‌ ఫీచర్‌ ద్వారా కన్వెన్షల్‌ సాకెట్‌ ద్వారా బ్యాటరీని చార్జ్‌ చేసుకోవచ్చు. భారత్‌లో ఆయా ప్రధాన నగరాల్లో బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇందులో ఫుల్‌ ఛార్జింగ్‌ను ఉపయోగించుకోవచ్చు. దేశంలో 3500 బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్లను బౌన్స్‌ ఏర్పాటు చేయనుంది కంపెనీ. ఈ స్కూటర్‌కు కంపెనీ మూడు సంవత్సరాల వారంటీ అందిస్తోంది. బౌన్స్‌ ఇన్ఫినిటీఈ1 ధర బ్యాటరీ ప్లస్‌ చార్జ్‌తో కలిపి రూ.79,999 (ఎక్స్‌షోరూమ్‌). ఇక బ్యాటరీ యూజ్‌ ఏ సర్వీస్‌ ద్వారా ఈ స్కూటర్‌ తీసుకుంటే దీని ధర రూ.45,099 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించింది కంపెనీ. కొన్ని రాష్ట్రాల్లో బ్యాటరీ ప్లస్‌ చార్జ్‌తో కలిపి రూ.59,999 వరకు ఉండే అవకాశం ఉంది.

ఒకినావా క్రూయిజర్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌:

ఒకినావా క్రూయిజర్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్లో విడుదలైంది. ఇది 3kW మోటార్ పవర్‌ను ఉత్పత్తి చేయగల 4kWh బ్యాటరీ ప్యాక్ సౌజన్యంతో ఫుల్-ఛార్జ్‌కి 120కిలోమీరట్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 100కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ స్కూటర్‌ ఛార్జింగ్‌ సమయం కేవలం 2-3 గంటలు మాత్రమే. సెమీ-డిజిటల్ బ్లూటూత్ కన్సోల్‌తో పాటు, వినియోగదారు అనుభవాన్ని మెరుగుపర్చడానికి స్కూటీ క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఆపరేషన్ మొదలైన ఫీచర్లను కూడా అందిస్తుంది. అంతేకాకుండా భద్రతా ప్రయోజనాల కోసం స్కూటర్ డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లను అందించింది. దీని ధర 1 లక్ష (ఎక్స్‌షోరూమ్‌).

ప్యూర్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌:

హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ప్యూర్ కొద్ది రోజుల క్రితం ePluto 7G ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.78,999గా నిర్ణయించింది. ఈ ఇ-స్కూటర్ ఒక వేరియంట్, 6 రంగులలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ స్కూటర్‌ను ఈఎంఐలో నెలకు రూ. 2,900తో కొనుగోలు చేయవచ్చు. ప్యూర్ EV యొక్క ePluto 7G 1500W ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. లిథియం-అయాన్ బ్యాటరీలను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 60 కి.మీ. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఈ స్కూటర్ 90-120 కి.మీల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.

బూమ్‌ మోటార్స్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

ఇక కోయంబత్తూరుకు చెందిన బూమ్‌ మోటార్స్‌ తన కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాలను మార్కెట్లో విడుదల చేసింది. బూమ్ కార్బెట్ పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఈ వాహనాన్ని రెండు వేరియంట్లలో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. కార్బెట్‌ 14, కార్బెట్‌ 13 ఈఎక్స్‌ అని రెండు వేరియంట్లు ఉన్నాయి. ఇక కార్బెట్ 14లో 2.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, కార్బెట్ 14ఈఎక్స్‌లో 4.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అమర్చించి కంపెనీ. కార్బెట్ 14 వేరియంట్ ఒక్కసారి చార్జ్‌ చేస్తే సుమారు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అలాగే కార్బెట్ 14ఈఎక్స్ టూవీలర్ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. వీటి ధర వరుసగా రూ.89,999, రూ.124,999. ఇందుకు సంబంధించిన వాహనాల బుకింగ్‌ కూడా ప్రారంభమైంది. ఈ రెండు వేరియంట్లకు చార్జింగ్‌ అయ్యేందుకు 2.5 నుంచి 4 గంటల్లో ఛార్జ్‌ అవుతాయి. ఇక స్పీడు విషయానికొస్తే గరిష్టంగా 75 కిలోమీటర్లు. ఈ వాహనాన్ని ఈఎంఐ రూపంలో కూడా కొనుగోలు చేయవచ్చు. నెలకు ఈఎంఐ రూ.1699 నుంచి ప్రారంభం అవుతుంది. ఇ-స్కూటర్స్‌ ఏడేళ్ల వారంటీతో లభించనున్నాయి. ఇంకో విషయం ఏంటంటే స్కూటర్‌ జీవిత కాలం ముగిసిన తర్వాత బ్యాటరీలు బూమ్‌ మోటార్స్‌ తిరిగి కొనుగోలు చేస్తాయి.

ఇవి కూడా చదవండి:

Post Office: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇంటి నుంచే ఈ బిల్లులు చెల్లించవచ్చు

Edible Oil Prices: సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. మరింతగా దిగి రానున్న వంట నూనె ధరలు

Latest Articles
డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టిన రోహిత్.. వైరల్ వీడియో
డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టిన రోహిత్.. వైరల్ వీడియో
లక్ష్మీదేవిని పూజించే ముందు ఇంట్లో ఈ వస్తువులుంటే తొలగించండి..
లక్ష్మీదేవిని పూజించే ముందు ఇంట్లో ఈ వస్తువులుంటే తొలగించండి..
ఆ హీరో చెయ్యాల్సిన ఆర్య అల్లు అర్జున్ చేసి హిట్ అందుకున్నాడు..
ఆ హీరో చెయ్యాల్సిన ఆర్య అల్లు అర్జున్ చేసి హిట్ అందుకున్నాడు..
తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఉగాండా.. 43 ఏళ్ల ఆటగాడికి ఛాన్స్..
తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఉగాండా.. 43 ఏళ్ల ఆటగాడికి ఛాన్స్..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి కోసం ఈ 9 విషయాలు మీకు తెలుసా !
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి కోసం ఈ 9 విషయాలు మీకు తెలుసా !
మరో ఫన్నీ వీడియో రిలీజ్ చేసిన ఆనంద్ మహీంద్రా
మరో ఫన్నీ వీడియో రిలీజ్ చేసిన ఆనంద్ మహీంద్రా
మే నెలలో మతిపోయే బైక్స్, స్కూటర్స్ లాంచ్.. !
మే నెలలో మతిపోయే బైక్స్, స్కూటర్స్ లాంచ్.. !
తినడానికి బతికున్న ఆక్టోపస్ ఆర్డర్.. డైనింగ్ టేబుల్‌పై పెట్టగానే
తినడానికి బతికున్న ఆక్టోపస్ ఆర్డర్.. డైనింగ్ టేబుల్‌పై పెట్టగానే
తెలంగాణ ఉద్యోగులకు ఆ 2 రోజులూ వేతనంతో కూడిన సెలవులు
తెలంగాణ ఉద్యోగులకు ఆ 2 రోజులూ వేతనంతో కూడిన సెలవులు
తీగ లాగితే.. డొంక అంతా కదిలింది.. పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు..
తీగ లాగితే.. డొంక అంతా కదిలింది.. పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు..