Post Office: మూడేళ్ల కనిష్టానికి పడిపోయిన పోస్టాఫీసు డిపాజిట్లు, ఇతర చిన్న పొదుపు ఖాతాలు: కేంద్రం వెల్లడి

Post Office: పోస్టాఫీసుల్లో కొత్త పొదుపు పథకాలు, టైమ్‌ డిపాజిట్‌, అనేక ఇతర చిన్న పొదుపు పథకాలు ఆర్థిక సంవత్సరం 2020-21లో మూడేళ్ల కనిష్టానికి పడిపోయినట్లు సోమవారం..

Post Office: మూడేళ్ల కనిష్టానికి పడిపోయిన పోస్టాఫీసు డిపాజిట్లు, ఇతర చిన్న పొదుపు ఖాతాలు: కేంద్రం వెల్లడి
Follow us
Subhash Goud

|

Updated on: Dec 13, 2021 | 4:52 PM

Post Office: పోస్టాఫీసుల్లో కొత్త పొదుపు పథకాలు, టైమ్‌ డిపాజిట్‌, అనేక ఇతర చిన్న పొదుపు పథకాలు ఆర్థిక సంవత్సరం 2020-21లో మూడేళ్ల కనిష్టానికి పడిపోయినట్లు సోమవారం లోక్‌సభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 2018-19లో 4.65 కోట్ల చిన్న పొదుపు ఖాతాలు తెరవగా, 2019-20లో 4.12 కోట్లకు, అలాగే 2020-21లో 4.11కోట్లకు పడిపోయినట్లు తెలిపింది. ఇక 2021-22 డేటాలో కేవలం పోస్టాఫీసులో ప్రారంభించిన చిన్న పొదుపు ఖాతాలు మాత్రమే ఈ సంవత్సరం ఇప్పటి వరకు 2.33 కోట్లు తెరవబడినట్లు వెల్లడించింది.

పోస్టాఫీసు సేవింగ్స్‌ ఖాతా ఓపెనింగ్స్‌లో గత మూడేళ్లలో అత్యధిక పథనం నమోదైంది. ఇవి 2018-19 ఆర్థిక సంవత్సరంలో 1.18 కోట్ల నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరంలో 72.1 లక్షలకు పడిపోయాయి. ఇక పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF) 2019-20 ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్‌ ఖాతా ఓపెనింగ్‌లు 11.5 లక్షల నుంచి 27.2 లక్షలకు పెరిగి 2020-21 ఆర్థిక సంవత్సరంలో 19.6 లక్షలకు పడిపోయాయి. అలాగే 2021-22 పీపీఎఫ్‌ ఖాతాలు మూడు లక్షలకు చేరుకున్నాయి.

గత మూడేళ్లుగా చిన్న పొదుపు రేట్లు తగ్గుముఖం పట్టాయి. పోస్ట్‌ ఆఫీస్‌ టైమ్‌ డిపాజిట్లు 2018-19 క్యూ1లో 6.6 శాతం వడ్డీ రేటు కలిగి ఉంది. ప్రస్తుతం 2021-22 క్యూ3కి ఇది 5.5 శాతం రేటు కలిగి ఉంది. మూడేళ్ల పోస్టాఫీసు టైమ్‌ డిపాజిట్‌ రేటు 6.9 శాతం నుంచి 5.5శాతానికి పడిపోయింది. ఈ సమయంలో పీపీఎఫ్‌ రేటు 7.6 శాతం నుంచి 7.1 శాతానికి పడిపోయింది. ఇవి బ్యాంకు ఎఫ్‌డీల కంటే ఎక్కువగా ఉన్నాయి. బ్యాక్‌ ఎఫ్‌డీలు తగ్గుతూనే ఉన్నప్పటికీ 2020-21 క్యూ1 నుంచి చిన్న పొదుపు రేట్లను ప్రభుత్వం తగ్గించడం నిలిపివేసింది.

ఇవి కూడా చదవండి:

Year Ender 2021: ఈ ఏడాది విడుదలైన టాప్‌-9 ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌.. ఫీచర్స్‌, ధర ఇతర వివరాలు

Sonia Gandhi: మహిళలను కించపర్చే ప్రశ్నలా.. సీబీఎస్‌ఈ టెన్త్‌ క్లాస్‌ సిలబస్‌పై సోనియా తీవ్ర అభ్యంతరం..