AMFI Demand on Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌పై విధించే పన్నులో ఏకరూపత ఉండాలి.. ప్రభుత్వాన్ని కోరిన ఏఎంఎఫ్ఐ
లిస్టెడ్ డెట్ సెక్యూరిటీలు.. బాండ్ మ్యూచువల్ ఫండ్స్ (MFలు)పై విధించే పన్నులో ఏకరూపతను తీసుకురావాలని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) ప్రభుత్వాన్ని కోరింది.
AMFI Demand on Mutual Funds: లిస్టెడ్ డెట్ సెక్యూరిటీలు.. బాండ్ మ్యూచువల్ ఫండ్స్ (MFలు)పై విధించే పన్నులో ఏకరూపతను తీసుకురావాలని మ్యూచువల్ ఫండ్ లు యూలిప్(ULIP)ల మధ్య సమానత్వాన్ని తీసుకురావాలని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) ప్రభుత్వాన్ని కోరింది. బడ్జెట్‌కు ముందు ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతిపాదనలో ఏఎంఎఫ్ఐ(AMFI) ఈ సూచనలను అందించింది. దీనితో పాటు, మ్యూచువల్ ఫండ్స్ తక్కువ-ధర.. తక్కువ-రిస్క్ పన్ను రహిత బాండ్-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లను (DLSS) ప్రవేశపెట్టడానికి అనుమతించాలని పేర్కొంది. ఇది కాకుండా, డిఎల్‌ఎస్‌ఎస్‌లో 1.5 లక్షల రూపాయల వరకు పెట్టుబడిపై పన్ను ప్రయోజనం ఇవ్వాలని ప్రభుత్వం నుంచి డిమాండ్ కూడా వచ్చింది. పన్ను ఆదా చేసే బ్యాంకు ఎఫ్‌డి పథకాలు వంటి ఐదేళ్ల వరకు పెట్టుబడులపై మాత్రమే ఈ ప్రయోజనం ఇవ్వాలని సూచించడం జరిగింది.
సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనం
ప్రస్తుతం, ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లు మాత్రమే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను-ప్రయోజనాన్ని పొందుతాయి. ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల రూపాయల వరకు పెట్టుబడులపై ఈ మినహాయింపు లభిస్తుంది. అన్ని నమోదిత బీమా కంపెనీలు తమ ఫండ్ మేనేజ్‌మెంట్ విధులను అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల (AMCs) ద్వారా నిర్వహించడానికి అనుమతించాలని ఏఎంఎఫ్ఐ సిఫార్సు చేసింది. అదేవిధంగా, బీమా కంపెనీలకు ఫండ్ మేనేజ్‌మెంట్ సేవలను అందించడానికి ఏఎంసీ(AMC)లను కూడా అనుమతించాలి.
మ్యూచువల్ ఫండ్స్‌పై పన్నులో ఏకరూపత ఉండాలి
మ్యూచువల్ ఫండ్ కంపెనీల సంఘం, ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించిన నివేదికలో, లిస్టెడ్ డెట్ సెక్యూరిటీలు.. బాండ్లకు సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్‌పై విధించే పన్నులో ఏకరూపత ఉండాలని పేర్కొంది. లిస్టెడ్ డెట్ సెక్యూరిటీలలో ప్రత్యక్ష పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల కోసం హోల్డింగ్ వ్యవధిని బ్యాలెన్స్ చేయాలనే డిమాండ్ కూడా ఉంది.
ఇది కాకుండా, బీమా కంపెనీల యూనిట్-లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లలో (యులిప్‌లు) చేసిన పెట్టుబడుల ఉపసంహరణపై పన్ను పరంగా కూడా యాంఫీ సమానత్వాన్ని సూచించింది. MFలు..ULIPల మధ్య సమానత్వాన్ని తీసుకురావడానికి ఇది అవసరం.