EPFO Nominee: మీ పీఎఫ్‌ ఖాతాకు నామినీ పేరు చేర్చారా..? గడువు దగ్గర పడుతోంది..!

EPFO Nominee: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) పీఎఫ్‌ చందాదారుల కోసం అనేక ఆన్‌లైన్‌ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. టెక్నాలజీ పెరిగిన..

EPFO Nominee: మీ పీఎఫ్‌ ఖాతాకు నామినీ పేరు చేర్చారా..? గడువు దగ్గర పడుతోంది..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 13, 2021 | 9:10 PM

EPFO Nominee: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) పీఎఫ్‌ చందాదారుల కోసం అనేక ఆన్‌లైన్‌ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. టెక్నాలజీ పెరిగిన కారణంగా చిన్న చిన్న అవసరాల కోసం ఈపీఎఫ్‌వో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ-నామినేషన్‌ సర్వీస్‌ అనేది ఆన్‌లైన్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. మీకు పీఎఫ్‌ ఖాతా ఉంటే అందులో నామిని పేరును నమోదు చేయాలి. లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే వచ్చే డబ్బులు రావు. అయితే ఈపీఎఫ్‌ నామినీని మార్చడానికి పీఎఫ్‌ సభ్యులు కొత్త నామినేషన్‌ దాఖలు చేయవచ్చని ఈపీఎఫ్‌ఓ ట్వీట్‌ చేసింది.

తాజాగా పీఎఫ్‌ అకౌంట్లో నామినీ పేరును ఫైనల్‌గా పరిగణిస్తారు. అయితే ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు సామాజిక భద్రత కల్పిస్తోంది ఈపీఎఫ్‌వో. ఇందులో ప్రతి నెల జమ అయ్యే మొత్తం భవిష్యత్తలో వివాహాలకు, ఇంటి నిర్మాణం, ఇతర ముఖ్యమైన అవసరాలకు ఎంతోగానో ఉపయోగపడనుంది. ఇక పెన్షన్‌ పథకం, బీమా సౌకర్యం ఉద్యోగి, వారి కుటుంబ సభ్యులకు భరోసాగా ఉంటుంది. అయితే వీటన్నింటిని పీఎఫ్‌ చందాదారుడు నామినీని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. చందదారులు నామినీని సులభంగా యాడ్‌ చేసుకనే సదుపాయాన్ని కల్పిస్తోంది ఈపీఎఫ్‌ఓ. ఆన్‌లైన్‌లో వివరాలన్ని సమర్పించాల్సి ఉంటుందని ఈపీఎఫ్‌ఓ కోరుతోంది.

ఆన్‌లైన్‌లో నామినీని వివరాలు నమోదు చేయడం ఎలా..?

► ముందుగా ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్‌ (epfindia.gov.in)ను ఓపెన్‌ చేయాలి.

► సర్వీస్‌ కేటగిరిలో ఫర్‌ ఎంప్లాయీస్‌ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.

► ఆ తర్వాత Member UAN/Online Service (OCS/OTCP) అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

► యూఏఎన్‌, పాస్‌వర్డ్‌తో వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావాలి.

► అందులో మేనేజ్‌ కేటగిరిలోని ఈ-నామినేషన్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

► అక్కడ ‘మేనేజ్‌’ విభాగంలోని ‘ఈ-నామినేషన్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

► ఆ తర్వాత యస్‌ అని క్లిక్‌ చేసి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయవచ్చు.

► యాడ్‌ ఫ్యామిలీ డీటెయిల్స్‌ ద్వారా నిమినీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

► సేవ్‌ నామినేషన్‌పై క్లిక్‌ చేశాక మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Post Office: మూడేళ్ల కనిష్టానికి పడిపోయిన పోస్టాఫీసు డిపాజిట్లు, ఇతర చిన్న పొదుపు ఖాతాలు: కేంద్రం వెల్లడి

Year Ender 2021: ఈ ఏడాది విడుదలైన టాప్‌-9 ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌.. ఫీచర్స్‌, ధర ఇతర వివరాలు

అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
"వితౌట్ ఐస్'' అని చెప్పడం మరిచిపోతున్నారా.? అంతే సంగతులు..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..