Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఎవరో స్కూల్ గర్ల్ అనుకునేరు.. ఇప్పుడు సౌత్ ఇండియాను షేక్ చేస్తోన్న బోల్డ్ బ్యూటీ

మనలో చాలామంది స్కూల్ ఉన్నప్పుడు ఒకలా, ఇప్పుడు ఒకలా ఉంటారు. వారు.. వీరే అంటే నమ్మడం కూడా కష్టంగా ఉంటుంది.

Viral Photo: ఎవరో స్కూల్ గర్ల్ అనుకునేరు.. ఇప్పుడు సౌత్ ఇండియాను షేక్ చేస్తోన్న బోల్డ్ బ్యూటీ
Tollywood Heroine
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 13, 2021 | 2:01 PM

మనలో చాలామంది స్కూల్ ఉన్నప్పుడు ఒకలా, ఇప్పుడు ఒకలా ఉంటారు. వారు.. వీరే అంటే నమ్మడం కూడా కష్టంగా ఉంటుంది. ఫేస్‌కట్స్ దగ్గర నుంచి ఫిజిక్ వరకూ అన్నీ మారిపోతాయ్. అలాంటివే కొందరి సెలబ్రిటీల ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ ఫోటోలో ఉంది ఫలానా స్టార్ అంటే కళ్లు తేలేస్తారు. తాజాగా అలాంటి ఫోటోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. సౌత్ ఇండియా బోల్డ్ అండ్ హాట్ బ్యూటీ అమలాపాల్ స్కూల్‌లో ఉన్నప్పటి ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. తొలుత చూడగానే అందరూ ఎవరో స్కూల్ అమ్మాయి అనుకుంటున్నారు. పరీక్షగా చూశాక అమలాపాల్ అని నిర్ధారించకుంటున్నారు.

అమలా పాల్ కేరళకు చెందిన సినీ నటి. 1991 అక్టోబరు 26న  కేరళ లోని ఎర్నాకుళంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. వీరి కుటుంబము కేరళ లోని కొచ్చిలో స్థిరపడింది. తండ్రి వర్గీస్ పాల్, కేంద్రప్రభుత్వ ఉద్యోగి. తల్లి అన్నీస్ పాల్ గృహిణి. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. విద్యాభ్యాసాన్ని కోచిలో పూర్తిచేసింది. అమలా పాల్ తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ చిత్రాలలో నటించింది.  తెలుగు లో నాయక్, ఇద్దరమ్మాయిలతో, లవ్ ఫెలుల్యూర్ వంటి చిత్రాలలో నటించి మంచి ఫేరు సంపాధించింది. జెండాపై కపిరాజు చిత్రం తర్వాత ఆమె మరో తెలుగు సినిమా చేయలేదు. ఇటీవల వచ్చిన పిట్టకథలు సిరీస్‌లో ఓ ముఖ్యపాత్ర పోషించింది. ఈ బోల్డ్ బ్యూటీ చిత్రసీమలోకి అడుగు పెట్టి 12 సంవత్సరాలు అయ్యింది. 2014లో తమిళ దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ను ప్రేమించి పెళ్లాడిన అమలా పాల్‌… మనస్పర్థలతో 2017లో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం తమిళ్‌లో అమలాపాల్ నటించిన 3 సినిమాలు రిలీజ్‌కు ఉన్నాయి. కాగా బోల్డ్ పిక్స్, స్టేట్మెంట్స్‌తో నెట్టింట నిత్యం హల్‌చల్ చేస్తుంటుంది అమలాపాల్.

Also Read: పోలీసులు వెళ్లేసరికి అంతా నిర్మానుష్యం.. అద్దం పగలగొట్టగా అస్సలు యవ్వారం.. షాక్

 బాలయ్య-చిరు మల్టిస్టారర్.. మైత్రి ప్రొడ్యూసర్స్ కీలక కామెంట్స్