AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi-Balakrishna: బాలయ్య-చిరు మల్టిస్టారర్.. మైత్రి ప్రొడ్యూసర్స్ కీలక కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ.. ఇద్దరూ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న హీరోలు. తెలుగు రాష్ట్రాల్లో వీరిద్దరికీ ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Chiranjeevi-Balakrishna: బాలయ్య-చిరు మల్టిస్టారర్.. మైత్రి ప్రొడ్యూసర్స్ కీలక కామెంట్స్
Balayya Chiru
Ram Naramaneni
|

Updated on: Dec 13, 2021 | 11:36 AM

Share

మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ.. ఇద్దరూ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న హీరోలు. తెలుగు రాష్ట్రాల్లో వీరిద్దరికీ ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ హీరోల సినిమాలు రిలీజ్ అయితే.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మోత మోగాల్సిందే. సినిమా పరిశ్రమ బాగుండాలని ఎప్పుడూ కోరుకునే ఈ ఇద్దరూ ఎన్నోసార్లు థియేటర్లలో ఒకేసారి సినిమాలు విడుదల చేసి తలపడ్డారు. అయినప్పటికీ అద్భుతమైన వసూళ్లతో రికార్డులు తిరగరాశారు. విడివిడిగా నటించిన సినిమాలే.. ఈ స్థాయి విజయాలు సాధిస్తే.. ఇద్దరూ కలిసి నటిస్తే ఎట్టా ఉంటది. ఆ ఊహే నెక్ట్స్ లెవల్ అన్నట్లు ఉంది కదా. ప్రస్తుతం తెలుగునాట ఉన్న పరిణామాలు చూస్తే… ఈ కోరిక కూడా నెరవేరుతుందని అనిపిస్తోంది. కాగా ఈ విషయంపై మీడియా అడిగిన ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. చిరు-బాలయ్య కలిసి నటిస్తామంటే.. ఏ నిర్మాత ఆ అవకాశాన్ని వదులుకుంటారని ప్రశ్నించారు. ఒక మంచి కథ దొరికితే.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తామన్నారు.

ఈ కాంబో కానీ కుదిరితే నెక్ట్స్ లెవల్ అని చెప్పాలి. మెగా, నందమూరి కుటుంబాలు ఫ్యాన్స్ మధ్య వార్ ఉంటుంది అని ఇప్పటివరకూ చెప్పుకునేవారు. కాగా ఆర్.ఆర్.ఆర్‌తో చరణ్, ఎన్టీఆర్.. ఆ పోకడకు గుడ్ బై చెప్పారు. ఇద్దరూ కలిసి బాక్సాఫీస్‌పై వార్ ప్రకటించారు. అదే విధంగా సీనియర్ హీరోలు చిరు, బాలయ్య సై అంటే మాత్రం… పాన్ ఇండియా రికార్డుల తుప్పు వదులుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Also Read: ప్రభాస్‌ ఇష్యూ మానసికంగా ట్రబుల్‌ చేసింది.. కీలక కామెంట్స్ చేసిన నిత్యామీనన్

West Godavari: పెళ్లికి వెళ్లి వచ్చేసరికి.. ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్

Follow Us
పెట్రోల్ పంపుల్లో రూ.2,000 కంటే ఎక్కువ UPI పేమెంట్లు బంద్?
పెట్రోల్ పంపుల్లో రూ.2,000 కంటే ఎక్కువ UPI పేమెంట్లు బంద్?
లవర్ లాంటి లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి..
లవర్ లాంటి లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి..
ఆ నటుడికి జరిగిన యాక్సిడెంట్ నా జీవితాన్ని మార్చేసింది..
ఆ నటుడికి జరిగిన యాక్సిడెంట్ నా జీవితాన్ని మార్చేసింది..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎప్పటి నుంచో తెలుసా..?
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎప్పటి నుంచో తెలుసా..?
పక్షులూ మమ్మల్ని వింతగా చూస్తాయి..? 20వ అంతస్థు పై వీడియో
పక్షులూ మమ్మల్ని వింతగా చూస్తాయి..? 20వ అంతస్థు పై వీడియో
50 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్కూల్ ఫ్రెండ్స్..1976 బ్యాచ్ రీయూనియన్
50 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్కూల్ ఫ్రెండ్స్..1976 బ్యాచ్ రీయూనియన్
ఏపీలో పేషెంట్లకు గుడ్‌న్యూస్‌.. రూ.75 వేల విలువ టెస్ట్‌ ఉచితం..!
ఏపీలో పేషెంట్లకు గుడ్‌న్యూస్‌.. రూ.75 వేల విలువ టెస్ట్‌ ఉచితం..!
జై గణేశా.. జై జై గణేశా..! వినాయకుడికి హెలికాప్టర్‌తో పూల వర్షం..
జై గణేశా.. జై జై గణేశా..! వినాయకుడికి హెలికాప్టర్‌తో పూల వర్షం..
యజమాని అంతిమ యాత్రలో శునకం..
యజమాని అంతిమ యాత్రలో శునకం..
ఈ వారం ఓటీటీలోకి టెన్షన్ పుట్టించే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు..
ఈ వారం ఓటీటీలోకి టెన్షన్ పుట్టించే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు..