West Godavari: పెళ్లికి వెళ్లి వచ్చేసరికి.. ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్

పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. కామవరపుకోట మండలం తడికలపూడిలో భారీ చోరీ జరిగింది. పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఇంటిని సాంతం దోచేశారు దొంగలు.

West Godavari: పెళ్లికి వెళ్లి వచ్చేసరికి.. ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్
Theft
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 13, 2021 | 11:05 AM

పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. కామవరపుకోట మండలం తడికలపూడిలో భారీ చోరీ జరిగింది. కుటుంబంతో కలిసి నిన్న సాయంత్రాం బంధువుల ఇంట్లో వివాహానికి వెళ్లిన వెంకటేశ్వరరావు.. ఉదయం వచ్చి చూసేసరికి ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువా పగలగొట్టు డబ్బు, బంగారు ఆభరణాలు మాయం చేశారు దుండగులు. కిటికీ తొలగించి ఇంట్లోకి ప్రవేశించారు దొంగలు. సుమారు 7 లక్షల నగదుతో పాటు 60 కాసుల బంగారం ఎత్తుకెళ్లారు. సీసీ టీవీ ఫుటేజ్ రికార్డ్ అయ్యే హార్డ్ డిస్క్‌లు కూడా చోరీ చేశారు దొంగలు. కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో దర్యాప్తు చేపట్టారు. చింతలపూడి సీఐ మల్లేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. ఇది పక్కా ప్రణాళికతో రెక్కీ చేసి దోపిడీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నట్లు సీఐ తెలిపారు.

మరోవైపు తణుకు మండలంలోని దువ్వలోనూ చోరీ జరిగింది. ఇక్కడ కూడా సేమ్ పెళ్లికి వెళ్లిన ఓ కుటుంబాన్నే టార్గెట్ చేశారు దుండగులు. తాళం వేసిన ఇంట్లోకి ప్రవేశించి.. 4 కాసుల బంగారం, 50 వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. జిల్లాలో హల్చల్ చేస్తున్న.. చెడ్డి గ్యాంగ్ పనే అయ్యి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులంతా తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాల సంచరింపు నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ముందస్తు చర్యలు చేపట్టారు. శివారు కాలనీలు, ఒంటరిగా ఉంటున్న ఇళ్లు, లాడ్జిలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఏటిఎం సెంటర్లు, బ్యాంకుల వద్ద పటిష్ట బందోబస్తు చేపట్టారు. నైట్ బీట్లు,పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. అపరిచితులు, అనుమానితులను ఆపి.. వివరాలు తెలుసుకుంటున్నారు. అనుమానాస్పదంగా అనిపిస్తే.. పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. రాత్రి వేళ వాహనాల తనిఖీలు చేపడుతున్నారు.

Also Read: బెబ్బులి వెన్నులో వణుకు పుట్టిస్తోన్న కుక్కలు.. అటు రావాలంటే హడల్..

ప్రభాస్‌ ఇష్యూ మానసికంగా ట్రబుల్‌ చేసింది.. కీలక కామెంట్స్ చేసిన నిత్యామీనన్