Telangana: బెబ్బులి వెన్నులో వణుకు పుట్టిస్తోన్న కుక్కలు.. అటు రావాలంటే హడల్..

కుక్కలను చూసి పులి భయపడటం ఎప్పుడైనా చూశారా..?. కవ్వాల్ టైగర్‌జోన్‌ పరిధిలో అలాంటి పరిస్థితే నెలకుంది. అయితే ఇవి మాములు కుక్కల కాదు.

Telangana: బెబ్బులి వెన్నులో వణుకు పుట్టిస్తోన్న కుక్కలు.. అటు రావాలంటే హడల్..
Kawal Tiger Reserve
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 13, 2021 | 9:54 AM

కుక్కలను చూసి పులి భయపడటం ఎప్పుడైనా చూశారా..?. కవ్వాల్ టైగర్‌జోన్‌ పరిధిలో అలాంటి పరిస్థితే నెలకుంది. అయితే ఇవి మాములు కుక్కల కాదు.. అడవి కుక్కలు. ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 200 వరకు అడవి కుక్కలు ఉన్నాయి. ఫారెస్ట్‌లో ఏర్పాటు చేసిన కెమెరాల ఆధారంగా అధికారులు ఈ సంఖ్యను నిర్ధారించారు. జన్నారం అటవీ డివిజన్‌లోనే సుమారుగా 90 అడవి కుక్కలు ఉన్నట్లు చెబుతున్నారు. వీటి భయంతో కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ పరిధిలోని జన్నారం అటవీడివిజన్‌లో ఏడాది కాలంగా పులి అడుగు పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం 2012 ఏప్రిల్‌లో కవ్వాల్‌ అభయారణ్యాన్ని టైగర్‌జోన్‌గా అనౌన్స్ చేసింది.  ఉమ్మడి అదిలాబాద్‌లో జిల్లాలోని అడవుల్లో… 892.23 చదరపు కిలోమీటర్లు కోర్‌ ఏరియా, 123.12 చదరపు కిలోమీటర్లు బఫర్‌ ఏరియాగా గుర్తించారు. ఛత్తీస్ గఢ్‌లోని ఇంద్రావతి టైగర్‌జోన్‌లో పులుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో..  కవ్వాల్‌ టైగర్‌ జోన్‌వైపు పులులు వెళ్తాయని అధికారులు భావించారు. అయితే అడవి కుక్కల భయంతో ఇక్కడ అడుగులు పెట్టేందుకు పులులు సాహసించడం లేదు. మందలుగా ఎగబడుతూ ఇవి.. బెబ్బులిని కూడా పరిగెత్తిస్తున్నాయి. బఫర్‌ ఏరియా అయిన కాగజ్‌నగర్‌ డివిజన్‌లో ఆరుకుపైగా పెద్దపులులు సంచరిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం, రకరకాల వన్యప్రాణులు, జలపాతాలు కలబోసిన కవ్వాల్‌ అడవుల్లోకి అడుగుపెట్టేందుకు మాత్రం అడవి కుక్కల భయంతో పులులు సాహసించడం లేదు.

అయితే పులులు రాకపోవడానికి అడవి కుక్కల భయం మాత్రమే కాకుండా.. కారిడర్‌ వెంబడి హైవే రోడ్డు పనులు జరగడం, మధ్యలో రైల్వేలైన్‌ ఉండటం.. పుశువులు, మనుషుల సంచారం కారణంగా కవ్వాల్‌ డివిజన్‌లోకి పులుల రాకకపోకలు తగ్గిపోయాయని అధికారులు చెబుతున్నారు.

Also Read:  ప్రభాస్‌ ఇష్యూ మానసికంగా ట్రబుల్‌ చేసింది.. కీలక కామెంట్స్ చేసిన నిత్యామీనన్

రూ.270తో లాటరీ టికెట్ కొన్న డ్రైవర్.. కొద్దిగంటల్లోనే దిమ్మతిరిగే వార్త.. అమ్మిన వ్యక్తి కూడా షాక్