AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్రిక్తం.. కలెక్టరేట్‌లో వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం!

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లా కలెక్టరేట్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

Crime News: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్రిక్తం.. కలెక్టరేట్‌లో వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం!
Suicide Attempt
Balaraju Goud
|

Updated on: Dec 13, 2021 | 12:53 PM

Share

Man Suicide attempt in Yadadri District: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లా కలెక్టరేట్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కలెక్టర్ ఛాంబర్‌లో మహేష్ అనే రైతు పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. తన భూ సమస్య పరిష్కరించడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదనతో ఈ దారుణానికి ఒడిగట్లు తెలిపాడు. తన పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం లేదంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన కలెక్టరేట్ సిబ్బంది అతన్ని అడ్డుకుని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆలేరు మండలం కొలనుపాకలో 4 ఎకరాల భూమిని ఆరు వేల రూపాయలకు 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేశారు మహేష్ తండ్రి ఉప్పలయ్య. అయితే ఇందుకు సంబంధించిన పాసు పుస్తకాలు ఇచ్చేందుకు రెవిన్యూ అధికారులు రోజుల తరబడి తిప్పించుకుంటున్నారని మహేష్ ఆరోపించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు మహేష్ తెలిపారు. కాగా, ఈ ఘటనపై జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. బాధితుడికి పాసు పుస్తకాలు జారీ చేసేందుకు హామీ ఇచ్చారు.

Read Also… Narendra Modi In Varanasi: మరోసారి సింప్లిసిటీ చాటుకున్న ప్రధాని మోదీ.. ఓ సామాన్య వ్యక్తి అందించిన..