Srikanth Addala : గొప్ప వ్యక్తుల పేరుతో ఇచ్చే అవార్డులు గౌరవాన్ని తీసుకొస్తాయి: శ్రీకాంత్ అడ్డాల
ఉమ్మడి కుటుంబ విలువలు, ప్రేమలను అత్యద్భుతంగా తెరకెక్కించిన ఘనత ప్రముఖ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకే దక్కుతుందని రంగస్థల నటుడు కృష్ణేశ్వరావు అన్నారు.
Srikanth Addala : ఉమ్మడి కుటుంబ విలువలు, ప్రేమలను అత్యద్భుతంగా తెరకెక్కించిన ఘనత ప్రముఖ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకే దక్కుతుందని రంగస్థల నటుడు కృష్ణేశ్వరావు అన్నారు. సావిత్రి స్మారక పురష్కారాన్ని ఈ ఏడాది శ్రీకాంత్ అడ్డాలకు ప్రదానం చేశారు. గత తొమ్మిదేళ్ళుగా సావిత్రి స్మారక అవార్డును సినీ రంగంలో పనిచేసిన వారికి అందజేస్తున్నామని.. ఈ ఏడాది వివిఐటి విద్యా సంస్థలతో కలిసి ఈ పురష్కారాన్ని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు ఇచ్చామన్నారు. చక్కని కుటుంబ కథా చిత్రాలను నిర్మించడంలో శ్రీకాంత్ అడ్డాల తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేశారని వివిఐటి సంస్థల అధినేత వాసిరెడ్డి విద్యాసాగర్ అన్నారు.
ఎంచుకున్న రంగంలో నాయకులుగా ఎదగటానికి విద్యార్థులు కృషి చేయాలని ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అన్నారు. గొప్ప వ్యక్తుల పేరుతో ఇచ్చే అవార్డులు గౌరవాన్ని తీసుకొస్తాయన్నారు. ప్రముఖ నటి, తెలుగు సినీ రంగం ఉన్నంత కాలం గుర్తుంచుకోదగిన నటి పేరు మీద అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు జీవితంలో ఎదురయ్యే సమస్యలను సులభంగా పరిష్కరిస్తారన్నారు. కళలు మనస్సుకు సంతోషాన్ని, ఉత్సాసాన్ని ఇస్తాయన్నారు. అవార్డు ఫంక్షన్ లో వివిఐటి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఇక శ్రీకాంత్ అడ్డాల ఇటీవల వెంకటేష్ హీరోగా నారప్ప సినిమాను తెరకెక్కించారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాను నారప్పగా రీమేక్ చేశారు. ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :