Sunil: విలన్‌గా మారనడానికి 300 సినిమాల్లో కామెడీ చేయాల్సి వచ్చింది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన సునీల్..
సునీల్.. కమెడీయన్, హీరో ఇప్పుడు విలన్.. కమెడియన్ గా రాణించిన సునీల్ ఒకానొక టైంలో వరుస సినిమాలతో దూసుకుపోయాడు.
Sunil: సునీల్.. కమెడీయన్, హీరో ఇప్పుడు విలన్.. కమెడియన్ గా రాణించిన సునీల్ ఒకానొక టైంలో వరుస సినిమాలతో దూసుకుపోయాడు. స్టార్ కమెడీయన్ గా పేరు తెచ్చుకుంటున్న సమయంలోనే హీరోగా మారాడు సునీల్. అందాల రాముడు సినిమాలో సునీల్ హీరోగా నటించాడు. ఈ సినిమాలో ఆర్తీఅగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమా లో సునీల్ హీరోగా నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. దంతర్వాత వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సినిమా చేశాడు సునీల్. ఈ సినిమా సునీల్ ను దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత సునీల్ సినిమాలా స్పీడ్ తగ్గింది.
ఆతర్వాత పూలరంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాల్లో సునీల్ సిక్స్ ప్యాక్ తో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ రెండు సినిమాలు కూడా మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఆతర్వాత వరుసగా సినిమాలు చేశాడు సునీల్. అయితే హీరోగా మాత్రం అనుకున్నంత క్లిక్ అవ్వలేకపోయాడు. దాంతో తిరిగి తనను నిలబెట్టిన కామెడీలోకి దిగాడు. కానీ సునీల్ అప్పటిలా నవ్వించలేక పోయాడన్న గుసగుసలు వినిపించాయి. దాంతో ఇప్పుడు విలన్ గా మారి భయపెడుతున్నారు. ఈ మేరకు ఆయన డిస్కో రాజా, కలర్ ఫోటో సినిమాల్లో విలన్ గా నటించారు. మొనీమధ్య వచ్చిన పుష్పక విమానం సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ గా కనిపించారు. ఇక ఇప్పుడు పుష్ప సినిమాలో ఫుల్ లెంగ్త్ విలన్ గా నటిస్తున్నారు సునీల్. ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో సునీల్ మాట్లాడుతూ..విలన్ అవ్వాలని ఇండస్ట్రీలోకి వచ్చాను.. నేను విలన్ గా మారడానికి కమెడియన్ గా 300 సినిమాలు చేయవలసి వచ్చింది .. హీరోగా ఓ 10 సినిమాలు చేయవలసి వచ్చింది అన్నారు. ఈ సినిమా వరకూ నన్ను కొత్తగా చూడండి. ఇతర భాషల్లో నేను కనిపించడమే ఇది ఫస్టు టైమ్ కనుక .. విలన్నే అనుకుంటారు . అక్కడ నాకు ఎలాంటి టెన్షన్ లేదు .. నా టెన్షన్ అంతా కూడా తెలుగు వెర్షన్ కి సంబంధించినదే”.. నన్ను ఈ సినిమాలో కొత్తగా చూడండి. ఈ సారి మాత్రం మిమ్మల్ని కాస్త భయపెడతాను .. భరించండి అంతే అంటూ చెప్పుకొచ్చారు సునీల్.
మరిన్ని ఇక్కడ చదవండి :