AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పోలీసులు వెళ్లేసరికి అంతా నిర్మానుష్యం.. అద్దం పగలగొట్టగా అస్సలు యవ్వారం.. షాక్

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ కలకలం రేపుతోంది. రోజుకు దాదాపు 10 పాజిటివ్‌ కేసుల వరకు బయటపడుతున్నాయి.

Viral: పోలీసులు వెళ్లేసరికి అంతా నిర్మానుష్యం.. అద్దం పగలగొట్టగా అస్సలు యవ్వారం.. షాక్
Dance Bar Secret Room
Ram Naramaneni
|

Updated on: Dec 13, 2021 | 12:25 PM

Share

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ కలకలం రేపుతోంది. రోజుకు దాదాపు 10 పాజిటివ్‌ కేసుల వరకు బయటపడుతున్నాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో కొందరు బార్ల నిర్వాహకులు మాత్రం బరితెగిస్తున్నారు. కొవిడ్‌ రూల్స్‌ను పాతరేస్తూ వందలాది మందితో బార్లలో హంగామా సృస్టిస్తున్నారు..

ఇలాంటి బార్ల బరితెగింపు చర్యలకు పోలీసులు చెక్‌ పెడుతున్నారు. బార్‌ నిర్వాహకుల ఆట కటకట్టిస్తున్నారు. మిడ్‌నైట్‌ రైడ్స్‌తో పరుగులు పెట్టిస్తున్నారు. అంధేరి ప్రాంతంలోని ఓ బార్‌పై ఆకస్మిక దాడులు చేసింది ముంబై సోషల్‌ సర్వీస్‌ బ్రాంచ్‌. ఈ దాడుల్లో బారులో ఉన్న 17 మంది డ్యాన్సర్లు.. వందలాది మంది జనంతో కిటకిటలాడుతుండటం కనిపించి పోలీసులే షాక్‌ అయ్యారు… బార్‌ లోనికి వెళ్లిన పోలీసులకు ముందు ఏమీ అర్థం కాలేదు. బార్‌కు ఓ పెద్ద మిర్రర్‌ అడ్డుగా పెట్టారు నిర్వాహకులు. మిర్రర్‌ను ధ్వంసం చేసిన పోలీసులు లోపల సీన్స్‌ చూసి షాక్‌కు గురయ్యారు. మహిళా డ్యాన్సర్లు.. మందుతో ఊగిపోతున్న డ్రింకర్స్‌తో కిటకిటలాడుతోంది బార్‌. బార్‌ నిర్వాహకులతో పాటు సదరు మహిళా డ్యాన్సర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసులు నమోదు చేసిన పోలీసులు అందరినీ స్టేషన్‌కు తరలించారు. ఓ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదుతో ముంబై పోలీసులు ఈ దాడులు జరిపినట్లుగా తెలిసింది.

Also Read: బాలయ్య-చిరు మల్టిస్టారర్.. మైత్రి ప్రొడ్యూసర్స్ కీలక కామెంట్స్

ప్రభాస్‌ ఇష్యూ మానసికంగా ట్రబుల్‌ చేసింది.. కీలక కామెంట్స్ చేసిన నిత్యామీనన్