Sonia Gandhi: మహిళలను కించపర్చే ప్రశ్నలా.. సీబీఎస్‌ఈ టెన్త్ క్లాస్ సిలబస్‌పై సోనియా తీవ్ర అభ్యంతరం..
లోక్‌సభలో అరుదుగా మాట్లాడే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అత్యంత కీలకప్రశ్నను లేవనెత్తారు. సీబీఎస్‌ఈ 10వ తరగతి సిలబస్‌తో పాటు పరీక్షలొ వచ్చిన అంశాన్ని లేవనెత్తారు.
లోక్‌సభలో అరుదుగా మాట్లాడే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అత్యంత కీలకప్రశ్నను లేవనెత్తారు. సీబీఎస్‌ఈ 10వ తరగతి సిలబస్‌తో పాటు పరీక్షలొ వచ్చిన అంశాన్ని లేవనెత్తారు. దేశ మహిళలను కించపర్చే విధంగా ఈ ప్రశ్న ఉందని, సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఈ ప్రశ్న ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు.
మహిళలకు మితిమీరిన స్చేచ్చ వల్లే దేశంలో నేరాలు పెరిగిపోతున్నాయని , మహిళలు సొంతంగా తీసుకుంటున్న నిర్ణయాలతో పిల్లలు చెడిపోతున్నారని సీబీఎస్‌ఈ సిలబస్‌తో పాటు పరీక్షలో క్వశ్చన్ రావడంపై సోనియాగాంధీ అభ్యంతరం తెలిపారు.
లోక్‌సభలో సోనియాగాంధీ ఈ అంశాన్ని లేవనెత్తిన క్షణాల్లోనే సీబీఎస్‌ఈ వివరణ ఇచ్చింది. టెన్త్ క్లాస్ సిలబస్‌తో పాటు ప్రశ్నాపత్నం నుంచి ఆ క్వశ్చన్ తొలగిస్తునట్టు స్టేట్‌మెంట్ విడుదల చేసింది. ఈ ప్రశ్నకు సంబంధించి పిల్లలకు ఫుల్‌మార్కులు ఇస్తునట్టు కూడా వివరణ ఇచ్చింది.