Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SMART Success: భారత అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం.. స్మార్ట్ ప్రయోగం విజయవంతం

భారత అమ్ముల పొదిలో మరో అద్భుత అస్త్రం చేరింది. భారత ఆయుధ సంప లాంగ్ రేంజ్ సూపర్‌సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడోస్ (స్మార్ట్)ను విజయవంతంగా నిర్వహించింది డీఆర్‌డీవో.

SMART Success: భారత అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం.. స్మార్ట్ ప్రయోగం విజయవంతం
Missile
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 13, 2021 | 4:35 PM

SMART Success: భారత అమ్ముల పొదిలో మరో అద్భుత అస్త్రం చేరింది. భారత ఆయుధ సంప లాంగ్ రేంజ్ సూపర్‌సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడోస్ (స్మార్ట్)ను విజయవంతంగా నిర్వహించింది డీఆర్‌డీవో. ఒడిశా బాలాసోర్‌ తీరంలో ఈ క్షిపణిని ప్రయోగం జరిగింది. భారత నౌకాదళానికి సంబంధించిన ఆయుధ వ్యవస్థను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రయోగం విజయవంతం అయ్యిందని DRDO వెల్లడించింది. “ఈ వ్యవస్థ టార్పెడోల సాంప్రదాయ శ్రేణికి మించి యాంటీ-సబ్ మెరైన్ వార్‌ఫేర్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడింది.” స్మార్ట్ టార్పెడో అనేది శ్రేణికి మించి యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ (ASW) కార్యకలాపాల కోసం లైట్ యాంటీ-సబ్‌మెరైన్ టార్పెడో సిస్టమ్ క్షిపణి సహాయ విడుదల చేస్తుంది. జలాంతర్గామిలను ఢీ కొట్టడంలో ఇది చాలా కీలకం. DRDL, RCI హైదరాబాద్, ADRDE ఆగ్రా, NSTL విశాఖపట్నంతోపాటు పలు డీఆర్‌డీఓ పరిశోధకులు ఈ టెక్నాలజీ అభివృద్ధిలో సహకరించారు.

ఈ వ్యవస్థ తదుపరి తరం క్షిపణి ఆధారిత స్టాండ్‌ఆఫ్ టార్పెడో డెలివరీ సిస్టమ్. ఈ పరీక్షలో క్షిపణి పూర్తి స్థాయి సామర్థ్యాన్ని విజయవంతంగా ప్రదర్శించారు. టార్పెడోల సాంప్రదాయ శ్రేణికి మించి యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ వ్యవస్థ రూపొందించబడింది. ఈ క్షిపణిలో టార్పెడో, పారాచూట్ డెలివరీ సిస్టమ్ విడుదల చేయడంలో సహకరిస్తాయి. యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ సామర్థ్యాన్ని నెలకొల్పడంలో పనితీరు ముఖ్యమని DRDO గత పరీక్షలో పేర్కొంది.

DRDO, భారత వైమానిక దళం (IAF) గత శనివారం పోఖ్రాన్ శ్రేణి నుండి దేశీయంగా రూపొందించిన..  అభివృద్ధి చేసిన హెలికాప్టర్ లాంచ్ స్టాండ్-ఆఫ్ యాంటీ-ట్యాంక్ (SANT) క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన తర్వాత ఈ పరీక్ష జరిగింది. లాంగ్-రేంజ్ బాంబ్ , స్మార్ట్ యాంటీ ఎయిర్‌ఫీల్డ్ వెపన్ (SAAW) తర్వాత భారత వైమానిక దళం ఆయుధాగారం మరింత బలపడింది.

బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు

డిసెంబర్ 8న, ఒడిశా తీరంలోని చాందీపూర్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఎయిర్-టు-ఎయిర్ వెర్షన్‌ను భారతదేశం విజయవంతంగా పరీక్షించింది. బ్రహ్మోస్ అభివృద్ధిలో మిషన్‌ను “ప్రధాన మైలురాయి”గా అభివర్ణిస్తూ, క్షిపణి ఎయిర్‌బోర్న్ వెర్షన్‌ను ఉదయం 10.30 గంటలకు సూపర్‌సోనిక్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ సుఖోయ్ 30 Mk-I నుండి పరీక్షించినట్లు వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి: Sonia Gandhi: మహిళలను కించపర్చే ప్రశ్నలా.. సీబీఎస్‌ఈ టెన్త్‌ క్లాస్‌ సిలబస్‌పై సోనియా తీవ్ర అభ్యంతరం..

వీడి వేశాలు పాడుగాను.. ఆర్డర్ చేసి రిజక్ట్ చేశాడు.. కారణం ఏంటో తెలిస్తే షాకే..