బ్యాంకు ఖాతాదారులకు పెద్ద భరోసా.. కచ్చితంగా 5 లక్షల గ్యారెంటీ..?

DICGC: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద మోదీ ప్రభుత్వం దాదాపు 11న్నర కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 1.62 లక్షల కోట్ల

బ్యాంకు ఖాతాదారులకు పెద్ద భరోసా.. కచ్చితంగా 5 లక్షల గ్యారెంటీ..?
Dicgc
Follow us
uppula Raju

|

Updated on: Dec 12, 2021 | 3:37 PM

DICGC: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద మోదీ ప్రభుత్వం దాదాపు 11న్నర కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 1.62 లక్షల కోట్ల రూపాయలను జమ చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఢిల్లీ నుంచి 100 రూపాయలు పంపితే 15 రూపాయలే లబ్ధిదారులకు చేరేదని నాటి ప్రధాని చెప్పేవారు కానీ నేడు మధ్యవర్తి, దళారీ ఎవరూ లేరు. ఒక విడతగా రెండు వేల రూపాయలు విడుదల చేస్తే మొత్తం 2000 లబ్ధిదారుడికి చేరుతుంది.

విజ్ఞాన్ భవన్‌లో డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ బ్యాంకుల్లోని ఖాతాదారులకు డిపాజిట్ బీమా మొత్తాన్ని చెల్లించారు. అనంతరం మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం అనేక సంస్కరణాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చాక జనాభాలో సగం మందికి సొంత బ్యాంకు ఖాతా కూడా లేదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా వచ్చిందని తెలిపారు. మోడీ హయాంలో దేశం తొందరగా అభివృద్ధి చెందుతుందని కొనియాడారు.

బ్యాంకు మునిగిపోతే రూ.5 లక్షలు గ్యారంటీ అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. మన దేశంలో బ్యాంకు డిపాజిటర్లకు ఇన్సూరెన్స్‌ వ్యవస్థ 60వ దశకంలోనే మొదలైందన్నారు. గతంలో బ్యాంకులో జమ చేసిన మొత్తంలో రూ.50 వేల వరకు మాత్రమే గ్యారెంటీ ఉండేది. ఆ తర్వాత లక్ష రూపాయలకు పెంచారు. ఒకవేళ బ్యాంకు మునిగిపోతే డిపాజిటర్లకు లక్ష రూపాయల వరకు మాత్రమే వచ్చేలా నిబంధన ఉండేది. ఈ డబ్బును ఎప్పుడు స్వీకరించాలనే దానిపై కాలపరిమితి కూడా ఉండేది కాదు. పేద, మధ్యతరగతి వర్గాల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని ఈ మొత్తాన్ని ఇప్పుడు రూ.5 లక్షలకు పెంచామని తెలిపారు.

ఈ మొత్తం 90 రోజుల్లో అందుతుంది చట్ట సవరణ ద్వారా మరో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఇంతకుముందు, రీఫండ్‌కు కాలపరిమితి ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం దానిని 90 రోజుల్లో అంటే 3 నెలలలోపు తిరిగి ఇవ్వడాన్ని తప్పనిసరి చేసింది. బ్యాంక్ మునిగిపోయిన సందర్భంలో కూడా డిపాజిటర్లు తమ డబ్బును 90 రోజుల్లోపు తిరిగి పొందుతారు.

10th,12th నుంచి MBBS వరకు స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు.. త్వరలో దరఖాస్తు చేసుకోండి

IBPS SO Exam 2021: డిసెంబర్ 26న స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌.. పరీక్షా సరళిని తెలుసుకోండి..

Hair Care: జుట్టు ఆరోగ్యానికి విటమిన్ ‘ఈ’ తప్పనిసరి..! ఎందుకో తెలుసుకోండి..?