AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care: జుట్టు ఆరోగ్యానికి విటమిన్ ‘ఈ’ తప్పనిసరి..! ఎందుకో తెలుసుకోండి..?

Hair Care: ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం కోసం విటమిన్ E కచ్చితంగా అవసరం. ఇది జుట్టు సంరక్షణకు సహాయపడుతుంది. అందుకు క్రమం

Hair Care: జుట్టు ఆరోగ్యానికి విటమిన్ 'ఈ' తప్పనిసరి..! ఎందుకో తెలుసుకోండి..?
Hair Care
uppula Raju
|

Updated on: Dec 12, 2021 | 1:29 PM

Share

Hair Care: ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం కోసం విటమిన్ E కచ్చితంగా అవసరం. ఇది జుట్టు సంరక్షణకు సహాయపడుతుంది. అందుకు క్రమం తప్పకుండా జుట్టుకి విటమిన్ ఈ ఆయిల్ పట్టించాలి. మీరు ఇంట్లోనే విటమిన్ ఈ హెయిర్ మాస్క్‌ని తయారు చేయవచ్చు. మీరు ఈ నూనెను ఇతర పోషక పదార్థాలతో కలిపి ఉపయోగించవచ్చు. ఇది మీ చర్మానికి ఉత్తమంగా పని చేస్తుంది.

విటమిన్ ఈ ఆయిల్ మీ జుట్టు మందం, పొడవును బట్టి కొన్ని విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకోండి. ఒక గిన్నెలో ఈ క్యాప్సూల్స్ నుంచి నూనె తీయండి. ఈ నూనెను మీ తలకు పట్టించి కొన్ని నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయండి. 30-40 నిమిషాలు అలాగే ఉంచి తేలికపాటి షాంపూతో కడగాలి. ఈ ప్రక్రియను ప్రతి వారం రెండు లేదా మూడు సార్లు చేయాలి. ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

విటమిన్ ఈ ఆయిల్, అలోవెరా జెల్ రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ తీసుకుని దానికి 2 టీస్పూన్ల విటమిన్ ఈ ఆయిల్ కలపండి. దీన్ని కలిపి మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని జుట్టు అంతటా అప్లై చేసి కాసేపు వేళ్లతో మృదువుగా మసాజ్ చేయండి. హెయిర్ మాస్క్‌ను 30-40 నిమిషాలు అలాగే ఉంచి ఆపై తేలికపాటి షాంపూతో కడగాలి. వారానికి 2 సార్లు ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది.

విటమిన్ ఈ ఆయిల్, అవోకాడో పండిన అవోకాడోను సగానికి కట్ చేయండి. గింజలు తీసివేసి మెత్తగా చేయండి. అందులో ఒక టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ మిక్స్ చేసి దానిని జుట్టుకు, తలకు పట్టించి గంటసేపు ఆరనివ్వండి. తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే జుట్టు మెరుస్తుంది.

విటమిన్ ఈ ఆయిల్, గుడ్డు, బాదం నూనె గుడ్డు పగలగొట్టి ఒక గిన్నెలో పోయండి. 4 విటమిన్ ఈ క్యాప్సూల్స్ నుంచి నూనెను తీసి గుడ్డు మిశ్రమంలో కలపండి. అలాగే 2 టీస్పూన్ల బాదం నూనె వేయండి. దీన్ని జుట్టు మొత్తానికి అప్లై చేయండి. ఒక గంట పాటు వదిలివేయండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. దీన్ని వారానికి 1 నుంచి 2 సార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

Yuvraj Singh: సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌.. అతడి రికార్డులు ఎవరికి సాధ్యం కావు..!

Ishant Sharma: ఇషాంత్‌ శర్మ కెరీర్‌ ముగిసినట్లేనా..! దక్షిణాఫ్రికా పర్యటన చివరిదా..?

SBI: ఎస్బీఐ బంపర్ ఆఫర్.. వ్యాపారులు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి..

Follow Us
ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. అంత్యక్రియలకు ఒక్క హీరో వెళ్లలేదు..
ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. అంత్యక్రియలకు ఒక్క హీరో వెళ్లలేదు..
త్వరలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు..కొనడానికి బెస్ట్ సమయం ఇదే!
త్వరలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు..కొనడానికి బెస్ట్ సమయం ఇదే!
ఆధార్ నుండి పాస్‌పోర్ట్ వరకు.. జూలై 1 నుంచి జరిగే కీలక మార్పులు ఇ
ఆధార్ నుండి పాస్‌పోర్ట్ వరకు.. జూలై 1 నుంచి జరిగే కీలక మార్పులు ఇ
ఏరువాక పౌర్ణమి 2026: రైతన్నల తొలి పండుగ ఇదే..! ప్రాముఖ్యత ఏంటంటే
ఏరువాక పౌర్ణమి 2026: రైతన్నల తొలి పండుగ ఇదే..! ప్రాముఖ్యత ఏంటంటే
తల్లి ‌కళ్లెదుటే విగతజీవిగా కొడుకు.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం
తల్లి ‌కళ్లెదుటే విగతజీవిగా కొడుకు.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం
శక్తివంతమైన కర్మ దశలోకి ప్రపంచం..? 2026 రెండో అర్ధభాగం ఎలా...
శక్తివంతమైన కర్మ దశలోకి ప్రపంచం..? 2026 రెండో అర్ధభాగం ఎలా...
ఐర్లాండ్‌ వెనకున్న శక్తి ఎవరు? టీమిండియానే ఓడించేంత బలం ఎక్కడిది?
ఐర్లాండ్‌ వెనకున్న శక్తి ఎవరు? టీమిండియానే ఓడించేంత బలం ఎక్కడిది?
ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే రోజంతా ఎనర్జీగా ఉంటారు
ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే రోజంతా ఎనర్జీగా ఉంటారు
ఉదయ్ కిరణ్ చనిపోయాక ఆ హీరో మా ఇంటికి వచ్చి ఏం చెప్పాడంటే..
ఉదయ్ కిరణ్ చనిపోయాక ఆ హీరో మా ఇంటికి వచ్చి ఏం చెప్పాడంటే..
ప్రతిరోజూ పరగడుపునే అల్లం నీరు తాగి చూడండి.. శరీరంలో జరిగేది ఇదే!
ప్రతిరోజూ పరగడుపునే అల్లం నీరు తాగి చూడండి.. శరీరంలో జరిగేది ఇదే!